పెళ్లికి అంగీకరించలేదని కత్తితో దాడి! | man attacks on girl in adilabad due to marriage cancelled | Sakshi
Sakshi News home page

పెళ్లికి అంగీకరించలేదని కత్తితో దాడి!

Nov 21 2016 5:09 PM | Updated on Oct 9 2018 5:39 PM

పెళ్లికి అంగీకరించలేదని కత్తితో దాడి! - Sakshi

పెళ్లికి అంగీకరించలేదని కత్తితో దాడి!

పెళ్లికి అంగీకరించలేదని ఆదిలాబాద్లో ఓ యువకుడు కత్తితో దాడి చేశాడు.

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో గౌతమీ డిగ్రీ కాలేజీలో డిగ్రీ సెకండియర్ చదువుతోన్న నందిని అనే విద్యార్థినిపై ఓ యువకుడు సోమవారం కత్తితో దాడి చేశాడు. పెళ్లి సంబంధం రద్దు చేసుకుందనే కోపంతోనే సదరు యువకుడు ఆ యువతిపై దాడి చేసినట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే... ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం మౌడగాడ గ్రామానికి చెందిన నందినికీ, అదే మండలం బెళగాం గ్రామానికి చెందిన నందుకూ 9 నెలల క్రితం నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత నందినికి ఇష్టం లేకపోవడంతో పెద్దలు నిశ్చితార్థాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో కోపం పెంచుకున్న అతను సోమవారం కాలేజీ నుంచి బయటకు వస్తోన్న నందినిపై కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన నందినినీ చికిత్స నిమిత్తం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. నందు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement