బాధ్యతలు స్వీకరించిన విద్యాసాగర్రావు | Maharashtra governor Vidyasagar Rao take charge of Tamil Nadu too | Sakshi
Sakshi News home page

బాధ్యతలు స్వీకరించిన విద్యాసాగర్రావు

Sep 2 2016 7:17 PM | Updated on Sep 4 2017 12:01 PM

బాధ్యతలు స్వీకరించిన విద్యాసాగర్రావు

బాధ్యతలు స్వీకరించిన విద్యాసాగర్రావు

తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్గా మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

చెన్నై: తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్గా మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్రావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈరోజు సాయంత్రం రాజ్ భవన్‌లోని దర్బార్ హాల్లో ఆయన ఇన్‌ఛార్జ్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్‌కౌల్.. విద్యాసాగర్రావుతో ప్రమాణ స్వీకారం చేయించారు.  తమిళనాడు గవర్నర్‌గా రోశయ్య పదవీ కాలం బుధవారంతో ముగిసిన విషయం తెలిసిందే.  ప్రమాణ స్వీకారం  అనంతరం తన బాధ్యతల్ని రోశయ్య... విద్యాసాగర్రావుకు అప్పగించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జయలలితతోపాటుగా మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement