ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారా? అంటే ఆయన సన్నిహితుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది
పవార్‌పై చవాన్ పోటీ?
Sep 16 2013 11:53 PM | Updated on Oct 8 2018 5:57 PM
ముంబై: ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ముంబై క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేయనున్నారా? అంటే ఆయన సన్నిహితుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఇప్పటిదాకా స్పష్టమైన ప్రకటన ఏదీ వెలువడకపోయినా ఎంసీఏ అధ్యక్ష పదవి కోసం వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో చవాన్ పోటీ చేస్తారని సమాచారం. ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌కు ప్రత్యర్థిగా చవాన్ రంగంలోకి దిగుతారని చెబుతున్నారు. పవార్ కూడా ఈ పదవిపై ఆసక్తి కనబరుస్తున్నారని తెలియడంతో మేజ్‌గావ్ క్రికెట్ క్లబ్ చవాన్‌ను తమ ప్రతినిధిగా నామినేట్ చేసినట్లు తెలిసింది.
Advertisement
Advertisement