టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావుపై పారిశ్రామికవేత్త కోగంటి సత్యం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
డుండి గణేష్ ఉత్సవాలను దౌర్జన్యంగా కబ్జా చేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే బోండా ఉమా గుండాలా వ్యవహరించారంటూ మండిపడ్డారు. అధికార పార్టీ బలాన్ని ఉపయోగించి తనను తప్పుడు కేసుల్లో ఇరికించినట్టు విమర్శించారు. ఎమ్మెల్యే బోండా రౌడీయిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తానని కోగంటి సత్యం తెలిపారు.