కావాలనే కొందరు 'ఉత్తమ విలన్' చిత్రాన్ని అడ్డుకుంటున్నారని కమల్‌హాసన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చెన్నై : కావాలనే కొందరు 'ఉత్తమ విలన్' చిత్రాన్ని అడ్డుకుంటున్నారని కమల్‌హాసన్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశం గర్వించతగ్గ నటుడి విశ్వరూపం చూడకుండా చేస్తున్నారని వారు మండిపడుతున్నారు. కమల్‌హాసన్ ప్రతి సినిమా విడుదలకు ఏవో ఒక ఆటంకాలు సృష్టించి వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్, కేరళ, పూణె, ఇలా అనేక రాష్ట్రాల నుంచి ఉత్తమ విలన్ సినిమా చూసేందుకు చెన్నై చేరుకున్నామని కమల్ ఫ్యాన్స్ చెబుతున్నారు. విమానాల్లో నిన్ననే చేరుకుని ఉదయం నుంచీ థియేటర్ల వద్ద ఎదురు చూస్తున్నా తమకు తీవ్ర నిరాశ ఎదురైందని తెలిపారు. కుల, మత, ప్రాంతాలకు అతీతంగా కమల్‌హాసన్‌కు అభిమానులున్నారని, వారందరి మద్దతు లోకనాయకుడికి ఉంటుందని చెప్పారు. సినిమా చూశాకే తాము థియేటర్ల వద్ద నుంచి వెళ్తామని, అంతవరకూ కదిలేదని అభిమానులు చెన్నైలోని థియేటర్ల వద్ద నుంచి చెబుతున్నారు.