‘కాంగ్రెస్ నేతలకు పదవులే ముఖ్యం’ | "It is important to the ranks of the Congress leaders' | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్ నేతలకు పదవులే ముఖ్యం’

Sep 13 2014 3:02 AM | Updated on Mar 29 2019 9:24 PM

ప్రజల కంటే కాంగ్రెస్ నాయకులకు పదవులే ముఖ్యమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ఆరోపించారు.

సాక్షి, బెంగళూరు : ప్రజల కంటే కాంగ్రెస్ నాయకులకు పదవులే ముఖ్యమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప ఆరోపించారు.  గుల్బర్గా జిల్లాలోని వరద పీడిత ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం శుక్రవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు.

ప్రజా సమస్యలను విస్మరించి మంత్రిపదవులు, నామినేటెడ్ పోస్టుల కోసం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీలో పైరవీలు నడుపుతున్నారని మండిపడ్డారు. అతివృష్టి, అనావృష్టితో నష్టపోయినా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేయడంపై కాంగ్రెస్ పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఫలితంగా వాస్తవ పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి తెలియకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement