మోదీ పుట్టినరోజున 3 గిన్నిస్ రికార్డులు! | In a record, PM Narendra Modi to gift aids to 11,000 on his 66th birthday | Sakshi
Sakshi News home page

మోదీ పుట్టినరోజున 3 గిన్నిస్ రికార్డులు!

Sep 16 2016 2:47 AM | Updated on Aug 24 2018 2:17 PM

మోదీ పుట్టినరోజున 3 గిన్నిస్ రికార్డులు! - Sakshi

మోదీ పుట్టినరోజున 3 గిన్నిస్ రికార్డులు!

ప్రధాని మోదీ 66వ పుట్టిన రోజు సందర్భంగా గిన్నిస్ రికార్డులను నెలకొల్పే కార్యక్రమాలను గుజరాత్ సర్కారు చేపట్టనుంది.

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ 66వ పుట్టిన రోజు సందర్భంగా గిన్నిస్ రికార్డులను నెలకొల్పే కార్యక్రమాలను గుజరాత్ సర్కారు చేపట్టనుంది. వీటిలో మూడు గిన్నిస్ రికార్డులు, ఒక జాతీయ రికార్డు ఉన్నాయి. వేడుకలు గుజరాత్‌లోని నవ్‌సారి జిల్లాలో నిర్వహిస్తారు. మొత్తం 11,223 మంది వికలాంగులకు 17,000 వీల్‌చైర్లు, మూడు చక్రాల సైకిళ్లను ఇవ్వనున్నారు.

ఒకే చిత్రం లేదా లోగోలో ఎక్కువ మంది వికలాంగులు వీల్‌చైర్లలో ఉండే గిన్నిస్ రికార్డును ఇక్కడ నెలకొల్పనున్నారు. వినికిడి లోపం ఉన్న వేయి మందికి వినడానికి ఉపయోగపడే సాధనాలను పంచిపెట్టి మరో రికార్డును, ఒకే ప్రదేశంలో 1,500 దీపాలను వెలిగించి మరో గిన్నిస్ రికార్డు నెలకొల్పుతారు. ఆ రోజును ‘సేవాదినం’గా జరుపుకోవాలని బీజేపీ అధ్యక్షుడు అమిత్ పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement