ప్రియుడికి భార్యను అప్పగించిన భర్త | Husband's wife surrender to boy friend in Tamilnadu | Sakshi
Sakshi News home page

ప్రియుడికి భార్యను అప్పగించిన భర్త

Dec 13 2014 10:55 AM | Updated on Jul 12 2019 3:07 PM

ప్రియుడికి భార్యను అప్పగించిన భర్త - Sakshi

ప్రియుడికి భార్యను అప్పగించిన భర్త

వివాహం చేసుకున్న భార్యను కన్యాదానంగా ప్రియునికి ఇచ్చి భర్త వివాహం జరిపించాడు.

చెన్నై: వివాహం చేసుకున్న భార్యను కన్యాదానంగా ప్రియునికి ఇచ్చి భర్త వివాహం జరిపించాడు. తిరుచ్చి జిల్లా, తురైయూరు సమీపం ఉప్పిలియాపురం వద్ద ఓ గ్రామానికి చెందిన దేవి, తురైయూర్ యూనియన్‌లోని మరో గ్రామానికి చెందిన నందకుమార్ (26)కు పెళ్లి చేయూలని పెద్దలు నిశ్చరుుంచారు. 20 రోజుల క్రితం నిశ్చితార్థం జరిగింది. బుధవారం ఉదయం వరుడి ఇంట్లో వీరిద్దరి వివాహం అట్టహాసంగా సాగింది. 

వరుని ఇంటికి వచ్చిన తర్వాత మొదటి రాత్రి  దేవి... నందకుమార్ కాళ్లపైపడి భోరున విలపించింది. నందకుమార్ ఏమి జరిగిందని ఆమెను ప్రశ్నించాడు. నవ వధువు మాట్లాడుతూ తన ఊరికి చెందిన లారీ డ్రైవర్‌ను ప్రేమిస్తున్నానని, తల్లిదండ్రులు బలవంతంగా ఈ వివాహం జరిపించారని తెలిపింది. తనను అతనితో కలపాలని ప్రాథేయపడింది. నందకుమార్ తన భార్యను ప్రియుని చెంతకు చేర్చేందుకు నిర్ణయించాడు. ఆపై వేరే ప్రాంతానికి వెళ్లిన ప్రియున్ని రప్పించి దేవితో తురైయూరు పెరుమాల్ ఆలయంలో వివాహం జరిపించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement