రంగారెడ్డి జిల్లా షాబాద్‌ను కొత్తగా ఏర్పాటయ్యే శంషాబాద్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున ఆందోళన కొనసాగుతోంది.
షాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తత
Sep 10 2016 5:01 PM | Updated on Mar 28 2018 11:26 AM
షాబాద్ : రంగారెడ్డి జిల్లా షాబాద్‌ను కొత్తగా ఏర్పాటయ్యే శంషాబాద్ జిల్లాలో కలపాలని డిమాండ్ చేస్తూ భారీ ఎత్తున ఆందోళన కొనసాగుతోంది. శనివారం ఉదయం నుంచి ముంబై-బెంగళూరు లింక్ జాతీయరహదారిపై అఖిలపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో జరుగుతోంది. ఆందోళన కారణంగా రెండు వైపులా 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఎంత నచ్చజెప్పినా ఆందోళన కారులు వెనక్కి తగ్గలేదు. దీంతో సాయంత్రం 4 గంటల సమయంలో పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి. ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసే అవకాశాలున్నట్లు సమాచారం. ఆందోళనలో బీసీ సంఘం రాష్ట్ర నేత కృష్ణ యాదవ్, అఖిలపక్షాల నేతలు రవీందర్‌రెడ్డి, శివకుమార్, గంగయ్య, నర్సింహగౌడ్, నారాయణ, మేకల నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement