ఆరోగ్యం @: 1000 | Health @: 1000 | Sakshi
Sakshi News home page

ఆరోగ్యం @: 1000

Aug 29 2015 3:04 AM | Updated on Aug 14 2018 2:24 PM

అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించిన వైద్యవరాల్లో ఒక్కటైన అమ్మ మాస్టర్ హెల్త్ చెకప్ పథకానికి రూ.1000 ఫీజుగా నిర్ణయించారు.

చెన్నై, సాక్షి ప్రతినిధి: అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జయలలిత ప్రకటించిన వైద్యవరాల్లో ఒక్కటైన అమ్మ మాస్టర్ హెల్త్ చెకప్ పథకానికి రూ.1000 ఫీజుగా నిర్ణయించారు. చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రజా ప్రభుత్వ ఆసుపత్రి (జీహెచ్)లో ఈ పథకాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. ఈనెల 25వ తేదీన జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి జయలలిత కొత్తగా చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను వరుసగా ప్రకటించారు. ప్రయివేటు ఆసుపత్రుల్లో మాస్టర్ హెల్త్ చెకప్‌కు రూ.5 వేల నుంచి రూ.12వేల వరకు ఫీజు వసూలు చేస్తుండగా, జీహెచ్‌లో అతితక్కువ ధరకే అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు.

మాస్టర్‌హెల్త్ చెకప్‌కు కేవలం రూ.1000 చెల్లించి 15 రకాల వైద్య పరీక్షలు చేయించుకోవచ్చని సీఎం శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రయివేటు ఆసుపత్రులతో పోల్చుకుంటే ఈ మొత్తం ఐదు శాతం మాత్రమేనని తెలిపారు. అలాగే 385 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా కొన్ని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మాస్టర్ హెల్త్ చెకప్ పథకం కోసం తొలుత రూ.10 కోట్లు మంజూరు చేయగా, మరో రూ.15 కోట్లు విడుదల చేసినట్లు సీఎం  తెలిపారు. జీహెచ్‌లో మరో రెండు నెలల్లో ఈ పథకం అమల్లోకి వస్తుందని జయ వివరించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement