‘పత్తి రైతులకు అన్యాయం చేస్తున్నారు’ | Sakshi
Sakshi News home page

‘పత్తి రైతులకు అన్యాయం చేస్తున్నారు’

Published Thu, Oct 27 2016 11:58 AM

farmers leader vasudevaya visits jammikunta agricultural market

జమ్మికుంట: పత్తి రైతులకు మార్కెట్‌లో న్యాయం జరిగే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని కరీంనగర్ జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు వాసుదేవరెడ్డి, క్యార్యదర్శి వెంకట్‌రెడ్డి తెలిపారు. గురువారం వారు జమ్మికుంట పత్తి మార్కెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్‌లో హెచ్చుతగ్గులు పేరుతో పత్తి రైతులకు నష్టం కలిగించటం తగదన్నారు.
 
రైతులకు మార్కెట్‌లో అందుబాటులో ఉండాల్సిన మార్కెట్ కార్యదర్శి దరిదాపులకు కూడా రావటం లేదని ఆరోపించారు. మార్కెట్‌లో రైతులకు కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సిబ్బంది వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ రైతులకు అన్యాయం చేస్తున్నారని తెలిపారు. అనంతరం వారు మార్కెట్ కమిటీ చైర్మన్ పింగిలి రమేశ్‌తో సమావేశమై రైతుల సమస్యలను వివరించి, పరిష్కరించాలని కోరారు. లేకుంటే తాము ఆందోళనలు చేపడతామని హెచ్చరించా

Advertisement

తప్పక చదవండి

Advertisement