ఇళయరాజా పాటతో మైమరిచిన గజేంద్రుడు!

Elephant sleep With Ilayaraja Music in Tamil Nadu - Sakshi

చెన్నై: సంగీత జ్ఞాని ఇళయరాజా సంగీతం సమకూర్చిన ఓ పాటను పాడి ఏనుగును నిద్రపుచ్చిన వీడియో సామాజిక మాధ్యాల్లో వైరల్‌ అవుతోంది. కేరళ రాష్ట్ర తిరుచ్చూర్‌కు చెందిన మావటి శ్రీకుమార్‌ ఒక ఏనుగును పెంచుతున్నాడు. ఇది గత కొంత కాలంలో నిద్రలేమితో బాధపడుతోంది. ఏనుగును నిద్రపుచ్చడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు శ్రీకుమార్‌. చివరికి ఒక సినిమా పాటలు లాలిపాటగా పాడాడు. ఆ పాటతో ఏనుగు హాయిగా నిద్రపోతుంది. ఈ వీడియో సమాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తోంది. శ్రీకుమార్‌ పాడిన పాట సంగీత జ్ఞాని ఇళయరాజ 1984లో సంగీతం సమకూర్చిన, మమ్ముట్టి నటించిన ఓ మలయాళ చిత్రంలోని పాట కావడం విశేషం.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top