వేడినీళ్లకు.. చల్నీళ్లు | Dodds Share the load Special Campaign | Sakshi
Sakshi News home page

వేడినీళ్లకు.. చల్నీళ్లు

Mar 18 2016 3:02 AM | Updated on Sep 3 2017 7:59 PM

వేడినీళ్లకు.. చల్నీళ్లు

వేడినీళ్లకు.. చల్నీళ్లు

కుటుంబంలో భార్యలు చేయాల్సిన ఇంటి పనుల్లోనూ వేడినళ్లకు చల్నీళ్లలా భర్తల సహకారం ఎక్కువగానే ఉందని, దాదాపు 70 మంది పురుషు

దేశంలో 70 శాతం మంది చేస్తున్నట్లు సర్వేలో వెల్లడి
 కొరుక్కుపేట: కుటుంబంలో భార్యలు చేయాల్సిన ఇంటి పనుల్లోనూ వేడినళ్లకు చల్నీళ్లలా భర్తల సహకారం ఎక్కువగానే ఉందని, దాదాపు 70 మంది పురుషులు భార్యల పనులను చేస్తున్నారని ఏరియల్ చేపట్టిన సర్వేలో వెల్లడైంది. గురువారం నగరంలోని ఏరియల్ ఇండియా ఆధ్వర్యంలో డాడ్స్ షేర్ ది లోడ్ పేరుతో ప్రత్యేక క్యాంపెయిన్‌ను నిర్వహించారు. ఇందులో ప్రముఖ నటి ప్రియాఆనంద్ హాజరై కుంటుంబంలో తండ్రి పాత్ర గురించి తన అభిప్రాయాలు పంచుకుంది.
 
  ఏరియల్ అసోసియేట్ బ్రాండ్ డెరైక్టర్ శరత్ వర్మ మాట్లాడుతూ ప్రస్తుతం మహిళలు అన్నిరంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. దీంతో కుటుంబంలో భార్య చేయాల్సిన పనుల్లోను భర్తల సహకారం అందిస్తున్నారని తెలిపారు. దాదాపు 70 శాతం మంది పురుషులు మహిళలకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారని అన్నారు.అదేవిధంగా కుంటుంబాల్లోని 70 శాతం మంది  చిల్డ్రన్స్‌కూడా అమ్మకు అండగా వివిధ పనుల్లో చేయికలుపుతున్నారని తెలిపారు. అనంతరం ప్రియాఆనంద్  మాట్లాడుతూ డాడ్స్ ఫేర్ ది లోడ్ పేరుతో క్యాంపెయిన్ నిర్వహించడం అందులో తాను పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement