డీఐజీ అకున్ సబర్వాల్.. కామారెడ్డిలో సుమారు అరకిలోమీటరు దూరం వాకింగ్ చేశారు.
కారు దిగి కాలినడకన..
Oct 19 2016 11:17 AM | Updated on Sep 4 2017 5:42 PM
అరకిలోమీటరు దూరం నడిచిన డీఐజీ
రైలు గేటు పడడంతో
ఎస్పీ కార్యాలయం దారిలో వాకింగ్..
సాక్షి, కామారెడ్డి : డీఐజీ అకున్ సబర్వాల్.. కామారెడ్డిలో సుమారు అరకిలోమీటరు దూరం వాకింగ్ చేశారు. వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్పీ కార్యాలయాన్ని పరిశీలించడానికి మంగళవారం ఆయన జిల్లాకు వచ్చారు. ఆయన రాక నేపథ్యంలో పట్టణ శివారు నుంచే పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తూ వస్తున్నారు. ఎస్పీ కార్యాలయం దారిలో రైలు వస్తుండడంతో గేట్‌మన్ గేటు వేశారు. గేటు తీయడానికి పది నిమిషాల వరకు సమయం పట్టే అవకాశం ఉండడంతో డీఐజీ కారు దిగి నడవడం ప్రారంభించారు. పట్టాలు దాటిన తర్వాత అవతలి వైపు ఉన్న ఎస్సై ఒకరు తన బుల్లెట్ వాహనాన్ని ఇవ్వబోగా వారించి కాలినడకనే ముందుకు సాగారు. సుమారు అర కిలోమీటరు నడిచిన తర్వాత రైల్వేగేటు ఎత్తడంతో డీఐజీ కారు వచ్చింది. దానిలో ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు.
Advertisement
Advertisement