గుంటూరు జిల్లాలో రెండు సామాజిక వర్గాల మధ్య మంగళవారం ఘర్షణ చోటు చేసుకుంది.
రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ
Sep 27 2016 4:22 PM | Updated on Aug 25 2018 5:38 PM
ఈపూరు: గుంటూరు జిల్లాలో రెండు సామాజిక వర్గాల మధ్య మంగళవారం ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సంఘటన ఈపూరు మండలకేంద్రంలో జరిగింది. ఈపూరుకు చెందిన ముద్ద మణెమ్మ(60) అనారోగ్యంతో సోమవారం మృతిచెందింది. ఈమె బీసీ కులానికి చెందినది. అయితే అంత్యక్రియలకు శ్మశాన వాటికకు తీసుకెళ్తుండగా.. మా శ్మశాన వాటికకు తీసుకురావద్దు అని ఎస్సీలు అడ్డుతగిలారు. తరతరాలుగా మేము కూడా ఇదే శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని బీసీలు తెలిపారు. ఈ విషయంలో ఘర్షణ జరిగి . దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలకు సర్దిచెబుతున్నారు.
Advertisement
Advertisement