నేడు గంగదేవిపల్లికి కేంద్ర బృందం | central team visits model gram panchayat gangadevipalli | Sakshi
Sakshi News home page

నేడు గంగదేవిపల్లికి కేంద్ర బృందం

Feb 18 2017 11:26 AM | Updated on Sep 5 2017 4:02 AM

వరంగల్‌ రూరల్ జిల్లాలోని గంగదేవిపల్లిలో కేంద్ర, రాష్ట్ర ఐఏఎస్‌ అధికారుల బృందం శనివారం పర్యటించనుంది.

వరంగల్‌‌: వరంగల్‌ రూరల్ జిల్లాలోని గంగదేవిపల్లిలో కేంద్ర, రాష్ట్ర ఐఏఎస్‌ అధికారుల బృందం శనివారం పర్యటించనుంది. ఇప్పటికే గ్రామం సాధించిన అభివృద్ధిని క్షుణ్ణంగా పరిశీలించి భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల గురించి ప్రజలను, గ్రామ సర్పంచ్‌ తదితరులను అడిగి తెలుసుకోనున్నది. పారిశుధ్యం పట్ల గ్రామ కమిటీ, గ్రామ ప్రజల విజయాన్ని, వారిలోని చైతన్యాన్ని తెలుసుకోనున్నది. అనంతరం ఈ బృందం వ్యక్తిగత మరుగుదొడ్లపై పూర్తి సర్వే చేసి ప్రధానికి నివేదిక అందజేస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement