రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి | btec student dies in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో బీటెక్ విద్యార్థి మృతి

Sep 19 2016 10:44 AM | Updated on Nov 9 2018 4:36 PM

రోడ్డు ప్రమాదంలో ఓ బీటెక్ విద్యార్థి మృతి చెందాడు.

ఏలూరు: రోడ్డు ప్రమాదంలో ఓ బీటెక్ విద్యార్థి మృతి చెందాడు. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటన్న తేజ సుశాంత్(19) ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
 
ఈ రోజు స్నేహితుడితో కలిసి బైక్‌పై కళాశాలకు వెళ్తుండగా.. గుర్తుతెలియని వాహనం బైక్‌ను ఢీకొట్టింది. దీంతో సుశాంత్ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement