కళాశాల కోసం మోదీకి రక్తంతో లేఖ | Blood Letter Written To PM Modi By Student Requesting To Start High School In Vijayapura District | Sakshi
Sakshi News home page

కళాశాల కోసం మోదీకి రక్తంతో లేఖ

Apr 8 2018 7:14 AM | Updated on Aug 24 2018 2:17 PM

Blood Letter Written To PM Modi By Student Requesting To Start High School In Vijayapura District - Sakshi

యశవంతపుర : ముద్దేబిహళ తాలూకా నాలతవాడలో కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ ఆ పట్టణానికి చెందిన విజయ రంజన జోషి అనే యువకుడు ప్రధాని మోదీకి తన రక్తంతో లేఖ రాశాడు. పట్టణంలో 15 వేల జనాభా ఉండగా  ప్రభుత్వ కళాశాల లేదని, దీంతో విద్యార్థులు ముద్దేబిహళకు వెళ్లాల్సి వస్తోందని ఆ లేఖలో పేర్కొన్నాడు. వచ్చిపోయేందుకే విద్యార్థులకు సమయం సరిపోతోందని, దీంతో వారు చదువపై దృష్టి పెట్టలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. కళాశాల ఏర్పాటు చేయాలని మంత్రులు, అధికారులకు విన్నవించినా స్పందన లేదన్నారు. మీరైనా స్పందించి కళాశాల మంజూరు చేయాలని ఆరు పేజీల లేఖలో పేర్కొన్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement