బీజేపీ అభ్యర్థుల ఖరారు | BJP candidates finalized | Sakshi
Sakshi News home page

బీజేపీ అభ్యర్థుల ఖరారు

Jul 30 2014 2:35 AM | Updated on Mar 29 2019 9:24 PM

బీజేపీ అభ్యర్థుల ఖరారు - Sakshi

బీజేపీ అభ్యర్థుల ఖరారు

‘బళ్లారి గ్రామీణం’నుంచి ఓబులేసు, శికారిపుర నుంచి బీవై రాఘవేంద్ర, చిక్కోడి-సదలగ నుంచి మహంతేశ బరిలోకి

ఉప ఎన్నికల పోరు..
‘బళ్లారి గ్రామీణం’నుంచి ఓబులేసు, శికారిపుర నుంచి బీవై రాఘవేంద్ర, చిక్కోడి-సదలగ నుంచి మహంతేశ బరిలోకి
 
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలోని మూడు శాసన సభ స్థానాలకు వచ్చే నెల 21న జరుగనున్న ఉప ఎన్నికలకు బీజేపీ తన అభ్యర్థులను ఎంపిక చేసింది. మంగళవారం ఇక్కడ బీజేపీ కార్యాలయంలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి నిర్వహించిన సమావేశం అనంతరం పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద జోషి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. బళ్లారి గ్రామీణ స్థానం నుంచి ఓబులేసు, శికారిపుర నుంచి బీవై రాఘవేంద్ర, చిక్కోడి-సదలగ స్థానంలో మహంతేశ కవటగిమఠలు పోటీ చేయనున్నారు.

గత శాసన సభ ఎన్నికల్లో ఈ స్థానాల నుంచి గెలుపొందిన అభ్యర్థులు లోక్‌సభకు ఎన్నిక కావడంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. బళ్లారి గ్రామీణ స్థానం నుంచి గతంలో బీ. శ్రీరాములు, శివమొగ్గ జిల్లా శికారిపుర నుంచి మాజీ ముఖ్యమంత్రి బీఎస్. యడ్యూరప్ప, బెల్గాం జిల్లా చిక్కోడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ప్రకాశ్ హుక్కేరి ఎన్నికైన సంగతి తెలిసిందే.

కాగా బళ్లారి అభ్యర్థి  ఓబలేసు పార్టీ ఎస్‌సీ మోర్చాలో పని చేస్తున్నారని జోషి తెలిపారు. శాసనసభ ఎన్నికల్లో శ్రీరాములు బీఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, యడ్యూరప్ప కేజేపీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా వారు బీజేపీ తీర్థాన్ని పుచ్చుకుని, ఆ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసి గెలుపొందారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement