బెంగళూరులో హైఅలర్ట్ | Bangalore High Alert | Sakshi
Sakshi News home page

బెంగళూరులో హైఅలర్ట్

May 27 2014 2:46 AM | Updated on Aug 15 2018 2:20 PM

నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం సందర్భంగా బెంగళూరు నగరంలో రెండు రోజుల (సోమ, మంగళ) పాటు హైఅలర్టు ప్రకటించినట్లు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ వివ రించారు.

  • మోడీ ప్రమాణ స్వీకారం సందర్భంగా కట్టుదిట్టమైన భద్రత
  •  ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్, బస్టాప్‌ల వద్ద అదనపు బలగాలు
  •  నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్
  •  బెంగళూరు, న్యూస్‌లైన్ : నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం సందర్భంగా బెంగళూరు నగరంలో రెండు రోజుల (సోమ, మంగళ) పాటు హైఅలర్టు ప్రకటించినట్లు నగర పోలీసు కమిషనర్ రాఘవేంద్ర ఔరాద్కర్ వివ రించారు. దేశ ప్రధానిగా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా కట్టుదిట్టమైన  భద్రత ఏర్పాటు చేశామని అన్నారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

    కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం, బెంగళూరు సిటీ రైల్వేస్టేషన్, కంటోన్మెంట్, యశవంతపుర, కేఆర్ పురం, యలహంక, హెబ్బాల, బిడిది, వైట్‌ఫీల్డ్ తదితర రైల్వే స్టేషన్‌లతో సహ మెజస్టిక్, సిటీ మార్కెట్, శివాజీనగర తదితర బస్‌స్టాండ్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని రాఘవేంద్ర ఔరాద్కర్ వివరించారు. అదే విధంగా నగరంలోని అన్ని బీజేపీ కార్యాలయాల వద్ద, సున్నితమైన ప్రాంతాల్లో నిఘా ఉంచినట్లు నగర అడిషనల్ పోలీసు కమిషనర్ కమల్‌పంత్ చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement