నిలకడగా బాలచందర్ ఆరోగ్యం | Balachander speedy recovery | Sakshi
Sakshi News home page

నిలకడగా బాలచందర్ ఆరోగ్యం

Dec 17 2014 2:25 AM | Updated on Sep 2 2017 6:16 PM

నిలకడగా బాలచందర్ ఆరోగ్యం

నిలకడగా బాలచందర్ ఆరోగ్యం

ప్రఖ్యాత సినీ దర్శకుడు కె.బాలచందర్ నగరంలోని కావేరి ఆస్పత్రిలో అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నారు.

ప్రఖ్యాత సినీ దర్శకుడు కె.బాలచందర్ నగరంలోని కావేరి ఆస్పత్రిలో అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతున్నారు. కిడ్నీ సమస్య మినహా మిగతా అన్ని అవయవాలు కుదుటపడినట్లు వైద్యులు మంగళవారం సాయంత్రం విడుదల చేసిన బులెటన్‌లో వెల్లడించారు. కిడ్నీలకు డయాలసిస్ చికిత్స అంది స్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బాలచందర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడిం చారు. పలువురు సినీ ప్రముఖులు బాలచందర్‌ను ఆస్పత్రిలో కలిసి పరామర్శించారు. డీఎంకే నేత స్టాలిన్, విజయకుమార్, నటి కె ఆర్ విజ య, రాజేష్, తమిళనాడు దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్ మొదలగు పలువురు కె.బాలచందర్‌ను పరామర్శించారు. కె ఆర్ విజయ బాలచందర్‌ను చూసి బోరున విలపించారు. ఆయన త్వరగా కోలుకుని ఇంటికి చేరాలని ఆమె ఆకాంక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement