పాత్ర కోసం బరువు పెరిగిన అనుష్క | Anushka Shetty Gaining 100 kg for Comeback Film | Sakshi
Sakshi News home page

పాత్ర కోసం బరువు పెరిగిన అనుష్క

Jul 16 2015 2:29 AM | Updated on Sep 3 2017 5:33 AM

పాత్ర కోసం బరువు పెరిగిన అనుష్క

పాత్ర కోసం బరువు పెరిగిన అనుష్క

పాత్రల స్వరూపాల కోసం కసరత్తులు చేసి తమను తాము మార్చుకోవడం అన్నది సాధారణంగా నటులు చేస్తుంటారు.

పాత్రల స్వరూపాల కోసం కసరత్తులు చేసి తమను తాము మార్చుకోవడం అన్నది సాధారణంగా నటులు చేస్తుంటారు.అది కూడా తమిళంలో కమలహాసన్, విక్రమ్ లాంటి అతి కొద్ది మందే.అలాంటిది అరుంధతిగా పరకాయ ప్రవేశం చేసి దక్షిణాది సినీ ప్రేక్షకుల హృదయాల్లో  స్థిరస్థాయిగా చోటు సంపాదించుకున్న అనుష్క పాత్రగా మారి నటిస్తున్న తాజా చిత్రం ఇంజి ఇడుప్పళగి. తెలుగులో సైజ్ జీరో అంటూ ద్విభాషా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అనుష్క 100 కేజీల బరువు పెరిగి నటిస్తున్నారు.

అనుష్క సాధారణ బరువు 80 కేజీలు. ఇంజి ఇడుప్పళగి చిత్రం కోసం 20 కేజీలు పెరిగారన్నమాట. బరువు కారణంగా ఇక యువతి జీవితంలో ఎదుర్కొనే సమస్యల ఇతి వృత్తంగా రూపొందుతున్న చిత్రం ఇంజిఇడుప్పళగి. ఇందులో పాత్ర గురించి బరువు పెరగాల్సిన విషయం గురించి దర్శకుడు అనుష్కకు ముందే చెప్పారట. బరువైన పాత్ర కావడంతో పాత్ర స్వరూపానికి తగ్గట్లుగా మారడానికి అంగీకరించారట.

ఈ చిత్రంలో అనుష్క సన్నగా, నాజూగ్గా, బొద్దుగా భారీ బరువు అంటూ రెండు పరిమాణాల్లో కనిపిస్తారట. స్లిమ్‌గా ఉండే సన్నివేశాల్ని ఇప్పటికే చిత్రీకరించారు. ఇక ఇప్పుడు భారీకాయంతో నటించాల్సిన సన్సివేశాల్ని చితీకరిస్తున్నారు. ఇటీవల బాహుబలి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడే అనుష్క లావుగా కనిపించారు. తన భారీకాయాన్ని పొడవైన దుప్పటాతో దాసుకునే ప్రయత్నం చేశారు. తాజాగా అనుష్క భారీ కాయం ఫొటోలు వెబ్‌సైట్‌లో హల్‌చల్ చేస్తుండడం విశేషం. ఏదేమయినా ఒక పాత్ర కోసం ఇలా బరువు తగ్గడం,పెరగడం కోసం కసరత్తులు చేస్తున్న అనుష్కను అభినందించాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement