ఆంధ్రా ఎన్నికలపై చర్చలు | Andhra negotiations elections | Sakshi
Sakshi News home page

ఆంధ్రా ఎన్నికలపై చర్చలు

May 6 2014 11:35 PM | Updated on Aug 14 2018 5:54 PM

తిరువళ్లూరులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల వేడి, ఎండల వేడి తగ్గిన నేపథ్యంలో ఆంధ్రా ప్రాంతానికి సరిహద్దుగా ఉన్న తిరువళ్లూరుకు ఆంధ్రా ఎన్నికలు తాకాయి.

తిరువళ్లూరు, న్యూస్‌లైన్: తిరువళ్లూరులో జరిగిన పార్లమెంట్ ఎన్నికల వేడి, ఎండల వేడి తగ్గిన నేపథ్యంలో ఆంధ్రా ప్రాంతానికి సరిహద్దుగా ఉన్న తిరువళ్లూరుకు ఆంధ్రా ఎన్నికలు తాకాయి. దీంతో ఎక్కడ చూసినా ఆంధ్ర రాజకీయాలపైనే చర్చలు సాగుతున్నాయి. తెలుగు రాష్ట్ర విభజన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం ఏ పార్టీకి ఉందన్న అంశంపై తిరువళ్లూరు ప్రజలు ఆంధ్రాలో ఉన్న తమ బంధువుల వద్ద ఆరా తీయడం ఎక్కువగా కనిపిస్తోంది. ప్రధానంగా నగరిలో రోజాకు ఎంత మెజారిటీ వస్తుంది, సత్యవేడులో వైఎస్సార్‌సీపీకి ఉన్న గెలుపు అవకాశాలు, చిత్తూరులో జంగాలపల్లి శ్రీనివాసులు మెజారీటీ తదితర అంశాలపై రచ్చబండ చర్చలు ముమ్మరంగా సాగుతున్నారుు.
 
 తిరువళ్లూరు జిల్లా అరంబాక్కంకు సరిహద్దు ప్రాంతంగా వున్న సూళూరుపేటలో జగన్ ప్రభంజనంపై ప్రజలు భారీగా అంచనా వేస్తున్నారు. తిరువళ్లూరు జిల్లాకు ఆంధ్రా -తమిళనాడు రాష్ట్రాల సరిహద్దులో ఉంటుంది. ఈ ప్రాంతం నుంచి వేర్వేరు పనుల నిమిత్తం ప్రజలు నిత్యం తిరువళ్లూరుకు రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో పాటు ఆంధ్రా నుంచి ఉద్యోగాల కోసం ఇక్కడి వచ్చి స్థిర పడిన వారు అధికంగానే ఉన్నారు. ఈ నేపథ్యంలో గత నెల 24న తిరువళ్లూరు పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు జరిగారుు. అప్పటి వరకు ఇక్కడి ప్రధాన పార్టీల గెలుపు ఓటముల మధ్య భారీగానే చర్చలు జరిగాయి. అయితే తిరువళ్లూరులో ఎన్నికలు ముగియడంతో ప్రస్తుతం సరిహద్దు ప్రాం తంగా వున్న ఆంధ్రా ఎన్నికలపైనే ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆంధ్రా ఎన్నికలపై తమకు తెలిసిన బంధువుల వద్ద తిరువళ్లూరు ప్రజలు ఎక్కువగా ఆరా తీయడం కనిపిస్తుంది. ఏ నలుగురు గుమికూడినా ఆంధ్రా రాజకీయాలపైనే చర్చించుకోవడం స్పష్టంగా కనిపిస్తుంది.
 
 వైఎస్సార్‌సీపీ ప్రభంజనంపైనే ఆరా: చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని సరిహద్దు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల విజయంపై జిల్లా ప్రజలు ఎక్కువ ఆసక్తి కనబరుస్తునానరు. సత్యవేడులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి మెజారిటీ ఎంత వస్తుంది. నగరిలో రోజాకు ఉన్న సానూభూతితో పాటు జగన్ ప్రభ ంజనం, సూళూరుపేటలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఎంత మోజారిటీ వస్తుందన్న దానిపై ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. అయితే వేర్వేరు ప్రాంతాల జిల్లా ప్రజలు ఇస్తున్న సమాచారం మేరకు జగన్ సీఎం కావడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజలకు అవసరాలను కరెక్ట్‌గా అంచనా వేయడంలో జగన్ సక్సెస్ అయ్యారనీ, అక్రమంగా జగన్‌ను జైలులో పెట్టినా తల్లి, చెల్లి ద్వారా పార్టీనీ విజయవంతంగా సాగించారనీ తెలుగు ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్‌తో రాజీలేనీ పోరాటం చేయడం, అభ్యర్థుల ప్రకటన విషయంలో అసంతృప్తులు లేకపోవడం జగన్‌కు వున్న రాజకీయ పరిపక్వానికి నిదర్శనమనీ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో పాటు ఆంధ్రా ఎన్నికల కోసం ప్రత్యేకంగా సర్వే చేసిన ఐబీ అధికారులు, జగన్‌కు గ్రామాల్లో మంచి పట్టు ఉందనీ పేరు చెప్పడానికి ఇష్టపడని ఐబీ అధికారి ఒకరు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement