
యశవంతపుర : తాగిన మైకంలో హుచ్చ వెంకట్ వీరంగం సృష్టించిన ఘటన రాజ రాజేశ్వరినగరలో చోటు చేసుకొంది. గురువారం ఉదయం నిద్రలేచి సమీపంలోని ఓ బేకరివద్దకు హుచ్చవెంకట్ వెళ్లాడు. ఏమి మాట్లాడకుండానే దుకాణం వద్ద ఉన్నవారిపై కాళ్లతో తన్ని అలజడి సృష్టించాడు. బేకరి యజమానిపై కూడా దాడికి దిగాడు. బేకరి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో హుచ్చ వెంకట్‌ను హెచ్చరించి పంపివేశారు. అనంతరం వెంకట్ కనిపించకుండా పోయాడు.