వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించడంద్వారా ఎన్సీపీ అభ్యర్థులను ఓడిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మయాంక్ గాంధీ పేర్కొన్నారు.
ముంబై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలోకి దించడంద్వారా ఎన్సీపీ అభ్యర్థులను ఓడిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మయాంక్ గాంధీ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడారు. సంప్రదాయ పార్టీలకు భిన్నంగా వ్యవహరించామని, కులం, మతం, ప్రాంతం వంటివాటిని దూరంగా ఉంచామని, అందువల్లనే ఢిల్లీ విధానసభకు ఇటీవల జరిగిన ఎన్నికల్లో అక్కడి ప్రజలు తమ పార్టీకి పట్టం కట్టారన్నారు. ఈ నెల 20వ తేదీలోగా అభ్యర్థుల తొలి జాబితాను తమ పార్టీ ప్రకటిస్తుందన్నారు. అయితే ఎన్ని నియోజకవర్గాలనుంచి పోటీ చేస్తారనే విషయాన్ని వెల్లడించలేదు.