3 లక్షల వెండి గొలుసులు స్వాధీనం | 3 lakhs ssilver chains seized in tamilnadu | Sakshi
Sakshi News home page

3 లక్షల వెండి గొలుసులు స్వాధీనం

May 8 2016 9:53 AM | Updated on Sep 3 2017 11:41 PM

3 లక్షల వెండి గొలుసులు స్వాధీనం

3 లక్షల వెండి గొలుసులు స్వాధీనం

గోపిచెట్టిపాళయం వద్ద ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వాహన తనిఖీలు జరిపి 3లక్షల వెండి గొలుసులు, 12 కిలోల వెండి కడ్డీలు, రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

సేలం: తమిళనాడు ఈరోడ్ జిల్లా గోపిచెట్టిపాళయం వద్ద ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు శనివారం వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా . మైసూరు నుంచి మదురైకి వెళుతున్న కర్ణాటక ప్రభుత్వ బస్సులో సేలంకు చెందిన మహ్మద్ యాకూబ్ వద్ద నుంచి 3 లక్షల వెండి గొలుసులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు 12 కిలోల వెండి కడ్డీలు, రూ.50 వేల నగదు కూడా స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్ కి తరలించారు. అతడిపై పోలీసులు కేసు నమోదు చేసి ... విచారిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తమ తనిఖీలను ముమ్మరం చేశారు. 

 


 

Advertisement
 
Advertisement
Advertisement