విమానంలో సీటు కింద భారీగా బంగారం | 3 kg gold seized at Chennai airport | Sakshi
Sakshi News home page

విమానంలో సీటు కింద భారీగా బంగారం

Jul 25 2017 4:22 PM | Updated on Aug 2 2018 4:35 PM

దుబాయి నుంచి వచ్చిన ఓ విమానంలో సోదా జరిపిన అధికారులు భారీగా బంగారాన్ని కనుగొన్నారు.

చెన్నై: దుబాయి నుంచి వచ్చిన ఓ విమానంలో సోదా జరిపిన అధికారులు భారీగా బంగారాన్ని కనుగొన్నారు. ప్రయాణికులంతా వెళ్లి పోయిన తర్వాత అధికారులు విమానాన్ని తనిఖీ చేయగా ఓ సీటు కింద ఉన్న మూడు కిలోల బంగారం బిస్కెట్లను కనుగొన్నారు. దీని విలువ రూ.1.15 కోట్ల వరకు ఉంటుందని రెవెన్యూ ఇంటలిజెన్స్‌ డైరెక్టరేట్‌ అధికారులు వెల్లడించారు. అక్రమంగా తీసుకువచ్చిన బంగారం పట్టుబడుతుందనే భయంతోనే అక్కడే పడేసి ఉంటారని భావిస్తున్నారు. దీనిని ఎవరు వదిలి వెళ్లారనే దానిపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement