బైక్‌ను ఢీకొట్టిన డీసీఎం: ముగ్గురి పరిస్థితి విషమం | 3 injured in road accident at bhupalapalli | Sakshi
Sakshi News home page

బైక్‌ను ఢీకొట్టిన డీసీఎం: ముగ్గురి పరిస్థితి విషమం

May 17 2017 3:46 PM | Updated on Aug 30 2018 4:10 PM

మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని అధికారులు పదే పదే చెప్తున్నా కొందరు అది తలకెక్కించుకోవడం లేదు.

ఘన్‌పూర్‌: మద్యం మత్తులో వాహనాలు నడపొద్దని అధికారులు పదే పదే చెప్తున్నా కొందరు అది తలకెక్కించుకోవడం లేదు. కిక్కులో వాహనాలు నడుపుతూ అమాయకుల ప్రాణాలు పొట్టన పెట్టుకుంటున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఘన్‌పూర్‌ మండలం కర్కపల్లి సమీపంలో ఓ డీసీఎం డ్రైవర్‌ మద్యం మత్తులో వాహనం నడుపుతూ ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో ద్విచక్రవాహనం పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలతో పాటు ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో 108 సాయంతో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement