నగరంలోని మెట్రోస్టేషన్లలో మరో 200 తనిఖీ బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. మెట్రోల్లో ప్రయాణిస్తున్న మహిళల సంఖ్య పెరుగుతుండడంతో ప్రస్తుతం ఉన్న తనిఖీ బూత్‌లు ఎటూ సరిపోవడంలేదు.
న్యూఢిల్లీ: నగరంలోని మెట్రోస్టేషన్లలో మరో 200 తనిఖీ బూత్‌లను ఏర్పాటు చేయనున్నారు. మెట్రోల్లో ప్రయాణిస్తున్న మహిళల సంఖ్య పెరుగుతుండడంతో ప్రస్తుతం ఉన్న తనిఖీ బూత్‌లు ఎటూ సరిపోవడంలేదు. దీంతో యుద్ధప్రాతిపదికన 200 తనిఖీ బూత్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్(డీఎంఆర్‌సీ) ప్రకటిం చింది. నీలం రంగులో ఏర్పాట్లు చేయనున్న ఈ క్యాబిన్లలో ఢిల్లీ పోలీసులతోపాటు కేంద్ర పారిశ్రామిక భద్రతా బలగాలు(సీఐఎస్‌ఎఫ్) విధులు నిర్వర్తిస్తాయి.
దశలవారీగా పూర్తిచేయనున్న ఈ పనులను మొదట బ్లూలైన్‌లో ప్రారంభించనున్నారు. ద్వారక సెక్టార్-21 నుంచి వైశాలీ/నోయిడా సిటీసెంటర్ మార్గంలోగల మెట్రో స్టేషన్లలో మొదట వీటిని ఏర్పాటు చేస్తారని, ఆ తర్వాత మిగతా స్టేష న్లలో ఏర్పాటు చేస్తారని సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను చేస్తున్నారు. వీటిని ఏర్పాటు చేయడం వల్ల మహిళా ప్రయాణికులను మరింత క్షుణ్ణంగా తనిఖీ చేయవచ్చునని, ప్రయాణికులకు కూడా ఇది సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. ఇంతకుముందు ఓ ఫ్రేమ్ మాత్రమే ఉండి దానికి చుట్టూ కవర్లలాంటి ఏర్పా ట్లు మాత్రమే ఉండేవి. అయితే ప్రస్తుతం ఏర్పాటు చస్తున్న క్యాబిన్లు పూర్తిగా కార్డ్‌బోర్డ్ వంటి వస్తువుల తో తయారు చేస్తున్నట్లు చెప్పారు. ఇది మహిళలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పారు.
భద్రతా ఏర్పాట్ల పెంపు..
తనిఖీ బూత్‌ల ఏర్పాటు మాత్రమేకాకుండా స్టేషన్లలో భద్రతా ఏర్పాట్లను మరింతగా పెంచుతున్నట్లు సీఐఎస్‌ఎఫ్ చీఫ్ అరవింద్ రాజన్ తెలిపారు. ప్రస్తుతం నగరంలోని 134 స్టేషన్లలో దాదాపు 5,000 మంది సీఐఎస్‌ఎఫ్ సిబ్బందే భద్రతా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో మహిళా సిబ్బంది కూడా ఉన్నారు. వీరికి ఢిల్లీ పోలీసులు కూడా తొడవడంతో భద్రత మరింత పటిష్టం కానుందని రాజన్ అభిప్రాయపడ్డారు.