శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.
శ్రీకూర్మం పుష్కరిణిలో పడి ఇద్దరు మృతి
Mar 3 2017 10:40 AM | Updated on Sep 2 2018 4:52 PM
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకూర‍్మం పుణ్యక్షేత్రం వచ్చిన ఇద్దరు వ్యక్తులు పుష్కరిణిలో ప్రమాదవశాత్తు మునిగి చనిపోయారు. విజయనగరం జిల్లా గాజులవలసకు చెందిన పట్నాల అరుణ్‌కుమార్, రాయగడకు చెందిన కొత్తకోట జనార్దనరావులు బావమరుదులు. వీరి వయస్సు 25, 26 సంవత్సరాలు ఉంటుంది. వీరి సమీప బంధువు చనిపోవడంతో అస్థికలు నిమజ్జనం చేసేందుకు శ్రీకూర్మం వచ్చి పుష్కరిణిలోకి దిగారు. ప్రమాదవశాత్తు నీటిలో పడి ఇద్దరూ మృతి చెందారు.
Advertisement
Advertisement