ప్రకాశం జిల్లాలో ఘాట్ రోడ్డులో భక్తులు ప్రయాణిస్తున్న డీసీఎం వ్యాన్ బోల్తా కొట్టింది.
ఘాట్ రోడ్డులో ప్రమాదం: 15 మందికి గాయాలు
May 6 2017 4:12 PM | Updated on Sep 5 2017 10:34 AM
	వలేటివారిపాలెం : ప్రకాశం జిల్లాలో ఘాట్ రోడ్డులో భక్తులు ప్రయాణిస్తున్న డీసీఎం వ్యాన్ బోల్తా కొట్టిన సంఘటన శనివారం జరిగింది. నెల్లూరుజిల్లా రాజుపాలెంకు చెందిన భక్తులు 30 మంది డీసీఎం వ్యాన్‌లో వలేటివారిపాలెం మండలంలోని మాలకొండ లక్ష్మీనరసింహ స్వామి దర్శనానికి తరలివచ్చారు. దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో ఘాట్ రోడ్డు దిగుతుండగా ఈ మధ్యాహ్నం వ్యాన్ బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
