పురిటి బిడ్డల కోసం 108 సేవలు | 108 services are mandatory for children | Sakshi
Sakshi News home page

పురిటి బిడ్డల కోసం 108 సేవలు

Jan 1 2014 1:47 AM | Updated on Sep 2 2017 2:09 AM

పురిటి బిడ్డల కోసం ప్రత్యేక 108 అంబులెన్స్ సేవ లు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ నందగోపాల్ తెలిపారు.

 వేలూరు, న్యూస్‌లైన్: పురిటి బిడ్డల కోసం ప్రత్యేక 108 అంబులెన్స్ సేవ లు అందుబాటులో ఉంటాయని కలెక్టర్ నందగోపాల్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ప్రత్యేక అంబులెన్స్‌ను కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో108 అంబులెన్స్‌లు సేవలు 36 వాహనాలున్నాయన్నారు. ఈ నేపథ్యంలో పురిటి బిడ్డల కోసం ప్రత్యేకంగా ఈ అంబులెన్స్‌ను ఉపయోగిం చాలన్నారు. పురిటి బిడ్డల కోసం జిల్లాలో రెండు 108 ప్రత్యేక అంబులెన్స్‌లు ప్రారంభించామన్నారు. ఒక అంబులెన్స్ వాలాజ ప్రభుత్వ ఆస్ప త్రి, మరొక వాహనం తిరుపత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంటుందన్నారు. అనంతరం అంబులెన్స్‌లో ఉంచిన అధునూతన పరికరాలను కలెక్టర్, అధికారులు పరిశీలించారు. జిల్లా ఆరోగ్యశాఖ ఆర్గనైజర్ డాక్టర్ కెనడి, అంబులెన్స్ మేనేజర్ శ్రీరామ్, వైద్యులు పాల్గొన్నారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement