ప్రధాని నరేంద్ర మోదీ చెన్నై మెట్రో రైలు ప్రారంభోత్సవంలో భాగంలో తమిళనాడులో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అక్కడ ఐఐటీ మద్రాస్‌ని సందర్శించడమే గాక అక్కడ ప్రాంగణంలో ఉన్న ప్రసిద్ధ జలకండేశ్వర ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. దీంతో సర్వత్రా ఆ ఆలయంపై ఆసక్తి నెలకొనడమే గాక ఆ దేవాలయ విశేషాల గురించి తెగ ఆరా తీయడం ప్రారంభించారు. మరి ఏంటి ఆ ఆలయ విశిష్టత, అక్కడి ప్రత్యేకతలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.
ప్రధాని నరేంద్ర మోదీ వెల్లూరు కోటలో చరిత్రకు, ముగ్ధమనోహరమైన శిల్పాలకు ఆలవాలమైన ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. శివుని సంబంధించిన ఈ ఆలయంలో విజయనగర యుగం నాటి వాస్తు లక్షణాలు, విస్తృతమైన రాతి నైపుణ్యాన్ని కళ్లకు కట్టినట్లు చూపిస్తాయి..అక్కడి స్థంభాలపై ఉండే డిజైన్లు. తమిళనాడు చూడాలనుకునే యాత్రికులు తప్పక చూడాల్సిన జలకండేశ్వర ఆలయం ఇది.
జలకండేశ్వర ఆలయం చారిత్రక వెల్లూరు కోట లోపల ఉంది. ఇది అత్యంత భిన్నమైన ఆలయం. దీని వాస్తుశిల్పం విజయనగర శైలికి చెందింది. భారీ ద్వారాలు, స్థంభాలు, వివరమైన శిల్పకళకు ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయ సముదాయంపైన తొమ్మిది అంతస్థుల గోపురం వంద అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉంటుంది. . దానిపై చెక్కిన శిల్పాలు చూపురులను ఎంతగానో ఆకర్షి‍్తాయి. దగ్గరక చూసేకొద్దీ మరింత అద్భుతంగా అనిపిస్తాయి.
నీటితో ముడిపడి ఉన్న ఆలయ చరిత్ర...
ఈ ఆలయం అత్యంత విశిష్ట లక్షణాలలో ఒకటి అగళి. అంటే గర్భగుడి చుట్టూ ఉన్న నీటితో నిండిన కందకం. ఈ నీరు రాతి నిర్మాణంతో ఒక అద్భుతమైన వైరుధ్యాన్ని ఏర్పరుస్తూ, ఈ సముదాయానికి ఒక సాధారణ ఆలయ ప్రాంగణానికి భిన్నమైన వాతావరణాన్ని ఇస్తుంది. నీటితో ఉన్న ఈ సంబంధం ఆలయం పేరులో కూడా ప్రతిబింబిస్తుంది. ఇక్కడ జలకండేశ్వరుడిని శివుని రూపంగా పూజిస్తారు. ఈ ఆలయ చరిత్ర గర్భగుడి చుట్టూ ఉన్న నీటితో సన్నిహితంగా ముడిపడి ఉంది. ఆలయం లోపల, అభిషేకం కోసం గంగా గౌరీ తీర్థం అనే పురాతన బావి నుంచి నీటిని తోడతారు. ఇది ఆలయ వాస్తుశిల్పాన్ని దాని మతపరమైన సంప్రదాయాలతో అనుసంధానించే మరో అంశం.
ఇక్కడ ఉండే కళ్యాణ మండపం, అంటే వివాహ మండపం. ఆలయ వాస్తుశిల్పంలోని ముఖ్యాంశాలలో ఒకటి. దానిపై ఉన్న విస్తృతమైన శిల్పాలు, శిల్ప వివరాలు విజయనగర కాలం నాటి కళాత్మక ఊహాశక్తి నిలువుటద్దం. ముఖ్యంగా ఒక శిల్పాన్ని నిశితంగా పరిశీలిస్తే..దానిని చూసే కోణాన్ని బట్టి అది ఒక ఎద్దుగా లేదా ఏనుగుగా కనిపిస్తుంది. చారిత్రక వాస్తుశిల్పంలో దాగి ఉన్న కథలు సందర్శకులకు, దృశ్యపరమైన చిక్కుముడులను అందిస్తూ..అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి.
మండపం స్తంభాలు కూడా గుర్రాలు, డ్రాగన్‌లు, యాలిలతో సహా క్లిష్టమైన ఆకృతులతో రూపొందించారు శిల్పులు. యాలిలు అంటే దక్షిణ భారత ఆలయ కళలో తరచుగా సింహం వంటి రూపాలతో చిత్రీకరించబడే పౌరాణిక జీవులు.
సాధారణంగా వెయ్యి స్తంభాల మండపం అని పిలువబడే ఐరంగల్ మండపం, ఈ ప్రాంగణంలో హడావిడిగా తిరగకుండా, కాసేపు ఆగి చూడటానికి మరో కారణం. విజయనగర వాస్తుశిల్పానికి సంబంధించిన విస్తృతమైన హస్తకళను ప్రదర్శించే, చెక్కిన రాతి స్తంభాలకు ఈ మండపం ప్రసిద్ధి చెందింది.
సందర్శించే సమయాలు
ఆలయం అధికారిక వెబ్‌సైట్ ప్రకారం సందర్శన సమయాలు ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8:30 వరకు దర్శన వేళలు ఉంటాయి.
ఎలా చేరుకోవాలి
చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయానికి సుమారుగా 135 కిలోమీటర్ల దూరంలో ఉంది. వెల్లూరుకు రైలు మార్గం ద్వారా కూడా చేరుకోవచ్చు, ఈ నగరానికి కాట్పాడి జంక్షన్ ఒక ప్రధాన రైల్వే స్టేషన్‌గా పనిచేస్తుంది.


