వహ్వా వంకాయ్‌! | 1.5 kg each Eggplants in veeraghattam market | Sakshi
Sakshi News home page

వహ్వా వంకాయ్‌!

Jan 15 2018 10:25 AM | Updated on Jul 11 2019 5:40 PM

1.5 kg each Eggplants in veeraghattam market - Sakshi

కిలోన్నర బరువున్న వంకాయ

శ్రీకాకుళం, వీరఘట్టం: వంకాయల కూర తింటే ఆహా.. అనని వారు బహు తక్కువ. కానీ కూర చేయకుండానే ఈ వంకాయ వహ్వా అనిపించేస్తోంది. వీరఘట్టం మార్కెట్‌లో ఒక్కో వంకాయ 1.5 కేజీల బరువు ఉండడంతో స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్థానికంగా వంగ పంట సాగు లేకపోవడంతో పార్వతీపురం నుంచి దిగుమతి చేస్తున్నామని వ్యాపారులు అంటున్నారు. పెద్ద సైజులో ఉండడంతో కొనుగోలు చేసేందుకు ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారని వ్యాపారులంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement