భారత్ లక్ష్యం 146 | Zimbabwe set 146 target | Sakshi
Sakshi News home page

భారత్ లక్ష్యం 146

Jul 19 2015 6:03 PM | Updated on Sep 3 2017 5:48 AM

భారత్ లక్ష్యం 146

భారత్ లక్ష్యం 146

భారత్తో చివరి, రెండో టి-20లో జింబాబ్వే146 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

హరారే:  భారత్తో చివరి, రెండో టి-20లో జింబాబ్వే146 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 145 పరుగులు చేసింది. చిబాబా (67) హాఫ్ సెంచరీతో రాణించడంతో జింబాబ్వే గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది.  

జింబాబ్వే ఓపెనర్లుగా మసకద్జ, చిబాబాలు వచ్చారు. జట్టు స్కోరు 28 పరుగుల వద్ద తొలి వికెట్ రూపంలో మసకద్జా(19)..  సందీప్ శర్మ బౌలింగ్లో వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన సికిందర్ రాజా (8).. మోహిత్ శర్మ బౌలింగ్లో అవుటయ్యాడు. చిబాబా హాఫ్ సెంచరీతో రాణించండంతో జింబాబ్వే స్కోరు 130 దాటింది. పరుగుల వేగం పెంచే క్రమంలోనే చిబాబా భారీ షాట్కు యత్నించి భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. విలియమ్స్ 17 పరుగులు చేశాడు. భారత్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, మోహిత్ శర్మలకు చెరో రెండు వికెట్లు దక్కగా, సందీప్ శర్మ, అక్షర్ పటేల్, స్టువర్ట్ బిన్నీలకు చెరో వికెట్ లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement