అప్పుడే నా రిటైర్మెంట్‌! - యువరాజ్‌

Yuvraj Singh says I will take a call on my career after 2019 - Sakshi

2019 ప్రపంచకప్‌ తర్వాతే రిటైర్మెంట్‌పై నిర్ణయం 

ఐపీఎల్‌ కోసం ఎదురు చూస్తున్నా

టీమిండియా క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌

సాక్షి, స్పోర్ట్స్‌ : 2019 ప్రపంచకప్‌ తర్వాతే రిటైర్మెంట్‌పై ఓ నిర్ణయం తీసుకుంటానని టీమిండియా క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. గతేడాది జూన్‌లో చివరిసారిగా అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ ఆడిన యువరాజ్‌ జట్టులో స్థానం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రిటైర్మెంట్‌పై వస్తున్న ప్రశ్నలపై యూవీ ఓ స్పోర్ట్స్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చాడు. 

‘ఐపీఎల్‌ కోసం ఎదురు చూస్తున్నా. 2019 ప్రపంచకప్‌కు ఎంపికవ్వడానికి ఉపయోగపడే ఈ టోర్నీ నాకెంతో ముఖ్యం. నేను 2019 వరకు క్రికెట్‌ ఆడాలనుకుంటున్నాను. ఏదైమైనా నా రిటైర్మెంట్‌ నిర్ణయం 2019 తర్వాతే ప్రకటిస్తా. నా కెరీర్‌ తొలి 6-7 ఏళ్లు అద్భుతంగా సాగింది. కానీ గొప్ప ఆటగాళ్లు ఉండటంతో టెస్టు మ్యాచ్‌లో అవకాశాలు రాలేదు. అవకాశం వచ్చినప్పుడు క్యాన్సర్‌ చికిత్స తీసుకుంటున్నాను. ఏ సమయానికి ఏం జరుగుతుందో తెలీదు. ఏది మన చేతుల్లో లేదు. నేనిప్పుడు కేవలం నా ఆటపైనే దృష్టి సారించాను.’అని యువీ చెప్పుకొచ్చాడు. 

ఇక దక్షిణాఫ్రికా గడ్డపై కోహ్లి సేన విజయంపై స్పందిస్తూ.. ఆటగాళ్లు గొప్ప ప్రదర్శన ఇచ్చారని, ముఖ్యంగా విరాట్‌ కెప్టెన్‌గా ముందుండి నడిపించాడని కొనియాడాడు. స్పిన్నర్లు కుల్దీప్‌, చాహల్‌లు అద్భుతంగా రాణించారని చెప్పుకొచ్చారు. అండర్‌-19 ప్రపంచకప్‌ సాధించిన యువ ఆటగాళ్లకు ఐపీఎల్‌ చక్కని వేదికని ఈ సిక్సర్ల సింగ్‌ చెప్పుకొచ్చాడు. ఈ టోర్నీని ఆస్వాదిస్తూ.. మరింత రాటుదేలుతారని యువీ అభిప్రాయపడ్డాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top