ఏడాదికి రూ.85 లక్షలు | Yearly 85 lakhs for p.v. sindhu | Sakshi
Sakshi News home page

ఏడాదికి రూ.85 లక్షలు

Feb 1 2014 1:05 AM | Updated on Sep 4 2018 5:07 PM

ఏడాదికి రూ.85 లక్షలు - Sakshi

ఏడాదికి రూ.85 లక్షలు

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడా పరికరాల సంస్థ లీ నింగ్... ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి పి.వి.సింధుతో ఒప్పందం కుదుర్చుకుంది.

 సాక్షి, హైదరాబాద్: ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడా పరికరాల సంస్థ లీ నింగ్... ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి పి.వి.సింధుతో ఒప్పందం కుదుర్చుకుంది. రెండేళ్ల పాటు ఏడాదికి రూ.85 లక్షల చొప్పున సింధుకు ఈ సంస్థ చెల్లిస్తుంది. ఇకపై సింధు ఈ సంస్థకు చెందిన లోగోతో, క్రీడా పరికరాలతో బరిలోకి దిగుతుంది. యోనెక్స్‌తో సింధుకు ఉన్న ఒప్పందం శుక్రవారంతో ముగిసింది. నేటి నుంచి సింధు లీనింగ్ బ్రాండ్  దుస్తులతో ఆడుతుంది. తొలుత అడిడాస్ కూడా సింధుతో చర్చలు జరిపినా... లీనింగ్ ఆకర్షణీయమైన మొత్తం ఆఫర్ చేయడంతో డీల్ కుదిరింది.
 
 రూ.4 కోట్లు అడుగుతున్న సైనా
 మరోవైపు సైనా నెహ్వాల్ కూడా త్వరలో కొత్త ఒప్పందం చేసుకోనుంది. ప్రస్తుతం యోనెక్స్ సైనాకు ఏడాదికి రూ.2 కోట్లు చెల్లిస్తోంది. ఈ ఒప్పందాన్ని రెన్యువల్ చేసుకునేందుకు సైనా రూ.4 కోట్లు డిమాండ్ చేస్తోంది. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. రూ.3 కోట్ల దగ్గర ఒప్పందం కుదిరే అవకాశం ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement