అయ్యో పంత్‌.. ఇలా చేశావేంటి? | World Cup 2019 Santner Snares The Big Wicket of Pant | Sakshi
Sakshi News home page

అయ్యో పంత్‌.. ఇలా చేశావేంటి?

Jul 10 2019 6:18 PM | Updated on Jul 10 2019 8:04 PM

World Cup 2019 Santner Snares The Big Wicket of Pant - Sakshi

మాంచెస్టర్‌ : ప్రపంచకప్‌ తొలి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా సంచలనం రిషభ్‌ పంత్‌ తీవ్రంగా నిరాశపరిచాడు. టాపార్డర్‌ పెవిలియన్‌కు క్యూ కడుతున్నా.. పంత్‌ అడ్డుగోడలా నిలిచాడు. కివీస్‌ బౌలర్లును సమర్థవంతంగా ఎదుర్కొని మ్యాచ్‌పై పంత్‌ ఆశలు రేకెత్తించేలా చేశాడు. అయితే కీలక సమయంలో అనవసరపు షాట్‌ కోసం యత్నించి ఔట్‌గా వెనుదిరగడం అందరినీ నిరుత్సాహానికి గురిచేసింది. ఇక ఈ ప్రపంచకప్‌లో పంత్‌ ప్రతీ మ్యాచ్‌లోనూ నిర్లక్ష్యంగానే ఔటయ్యాడని నెటిజన్లు విమర్శిస్తున్నారు. 

కివీస్‌ స్పిన్నర్‌ సాంట్నర్‌ వేసిన 23 ఓవర్‌లో తొలి నాలుగు బంతులు పరుగులు రాలేదు. దీంతో అసహనానికి గురైన పంత్‌ ఐదో బంతిని బౌండరీకి పంపించాలని మిడ్‌ వికెట్‌ మీదుగా భారీ షాట్‌ ఆడాడు. అయితే అక్కడే ఫీల్డింగ్‌ చేస్తున్న గ్రాండ్‌హోమ్‌ రెండు చేతులా క్యాచ్‌ అందుకోవడంతో పంత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. కీలక సమయంలో అనవసర షాట్‌ ఆడిన పంత్‌పై పాండ్యాతో సహా పెవిలియన్‌లో ఉన్న కోహ్లి, టీమ్‌ మేనేజ్‌మెంట్‌ అసహనం వ్యక్తం చేసింది. ఇక సోషల్‌మీడియా వేదికగా నెటిజన్లు పంత్‌ పేలవ షాట్‌పై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌ను పంత్‌ గెలిపిస్తే చరిత్రలో నిలిచిపోయేవాడని అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement