పాక్‌ గెలుపుపై సానియా ట్వీట్‌

World Cup 2019 Sania Mirza Congratulates Pakistan Thrilling Win - Sakshi

హైదరాబాద్‌: సంచలనాలకు మారుపేరైన పాకిస్తాన్‌ మరోసారి ఎవరి అంచనాలకి అందదని నిరూపించింది. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌ చేతిలో ఘోరం ఓడిపోయిన పాక్‌ తన రెండో మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ జట్టుపై అనూహ్య విజయం సాధించింది. ప్రపంచకప్‌లో భాగంగా సోమవారం ఇంగ్లండ్‌పై పాకిస్తాన్‌ 14 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో సోషల్‌ మీడియా వేదికగా పాక్‌ జట్టుని ఆ దేశ అభిమానులు ప్రశంసలతో ముంచెత్తారు. తాజాగా భారత టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా ట్విటర్‌ వేదికగా పాక్‌ జట్టుకు అభినందనలు తెలిపారు. 

‘పాకిస్థాన్ జట్టుకు అభినందనలు. ఓ మ్యాచ్లో ఘోరంగా ఓడిపోయిన అనంతరం పుంజుకుని గెలుపు బాట పట్టడం అద్భుతం. పాకిస్థాన్ ఎప్పుడు ఎలా ఆడుతుందో ఊహించలేమని అందరూ ఎందుకు అంటారో మరోసారి రుజువైంది. పాక్‌ గెలుపు బాట పట్టడంతో ప్రపంచకప్‌ మరింత ఆసక్తిగా మారుతుందనడంలో సందేహం లేదు’అంటూ ట్వీట్‌ చేశారు. ఇక సానియా ట్వీట్‌పై మిశ్రమ స్పందన వస్తోంది. ‘జూన్‌ 16న జరిగే మ్యాచ్‌ ఫలితం గురించి కూడా ట్వీట్‌ చేయాలి. ఎందుకంటే ఆ మ్యాచ్‌లో పాక్‌పై కోహ్లి సేన గెలుస్తుంది. టీమిండియాను పొగుడుతూ కామెంట్‌ చేయడం మర్చిపోకు’అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 

కాగా చివరిగా ఆడిన 11 వన్డేల్లోనూ పాక్‌ ఓడింది. దీంతో.. సుదీర్ఘ విరామం తర్వాత గెలుపు రుచి చూడడంతో పాక్‌ ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక ప్రపంచకప్‌లో భాగంగా జూన్‌ 16న భారత్‌-పాక్‌ల మ్యాచ్‌ జరగనుంది. అయితే ప్రపంచకప్‌లో పాక్‌పై టీమిండియా ఇప్పటివరకు ఓడిపోలేదు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం ఇరుదేశాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌ కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు

04-06-2019
Jun 04, 2019, 20:55 IST
కార్డిఫ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక 202 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. కుశాల్‌ పెరీరా(78) హాఫ్‌...
04-06-2019
Jun 04, 2019, 20:54 IST
సౌతాంప్టన్‌: ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ 2017 తమకు గుణపాఠం నేర్పిందని టీమిండియా సారథి విరాట్ కోహ్లి పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా...
04-06-2019
Jun 04, 2019, 19:54 IST
హైదరాబాద్‌:  టెలివిజన్‌ కార్యక్రమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది వ్యాఖ్యాతే(యాంకర్‌). కార్యక్రమం చూసే ప్రేక్షకుల దృష్టి ముందుగా వచ్చే యాంకర్‌పైనే ఉంటుంది....
04-06-2019
Jun 04, 2019, 19:04 IST
రిలయన్స్ జియో యూజర్లకు శుభవార్త. ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 మ్యాచ్‌లు ఉచితంగా చూసే అవకాశం కల్పిస్తూ యూజర్లను...
04-06-2019
Jun 04, 2019, 18:37 IST
కార్డిఫ్‌: వరల్డ్‌కప్‌లో భాగంగా శ్రీలంక-అఫ్టానిస్తాన్‌ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. అకస్మాత్తుగా వర్షం రావడంతో అంపైర్లు ఆటకు...
04-06-2019
Jun 04, 2019, 17:40 IST
సౌతాంప్టాన్‌: వన్డే వరల్డ్‌కప్‌లో ఇప్పటికే రెండు వరుస మ్యాచ్‌ల్లో ఓడిపోయిన దక్షిణాఫ్రికాకు మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా దక్షిణాఫ్రికా...
04-06-2019
Jun 04, 2019, 16:55 IST
కార్డిఫ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంక మరోసారి తడ‘బ్యాటు’కు గురైంది.  అఫ్గానిస్తాన్‌తో మ్యాచ్‌లో లంకకు శుభారంభం లభించినా ఆ జట్టు ఒకే...
04-06-2019
Jun 04, 2019, 16:24 IST
కార్డిఫ్‌: శ్రీలంక క్రికెటర్‌ లహిరు తిరిమన్నే అరుదైన క్లబ్‌లో చేరాడు. వన్డే ఫార్మాట్‌లో మూడు వేల పరుగుల మార్కును పూర్తి...
04-06-2019
Jun 04, 2019, 15:33 IST
ఆసీస్‌కు స్టీవ్‌ వా వార్నింగ్‌
04-06-2019
Jun 04, 2019, 14:47 IST
​కార్డిఫ్‌: వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో అన్ని రంగాల్లో విఫలమై ఘోర ఓటమిని చవిచూసిన శ్రీలంక...
04-06-2019
Jun 04, 2019, 14:34 IST
తన జోస్యం నిజమైందని పాకిస్తాన్‌ మాజీ బౌలర్‌ షోయబ్‌ అక్తర్‌ మురిసిపోతున్నాడు.
04-06-2019
Jun 04, 2019, 13:27 IST
మేమంతా అస్థిపంజరాలు కావాలా ఏందీ..
04-06-2019
Jun 04, 2019, 09:28 IST
కోహ్లిసేన రాణించాలంటే అభిమానులుగా మీకు ఓపిక ఉండాలి..
04-06-2019
Jun 04, 2019, 08:48 IST
చాలా సులువుగా.. నైస్‌గా ధోని బంతిని మైదానం బయట ఎత్తేశాడు
04-06-2019
Jun 04, 2019, 04:00 IST
లండన్‌: ఇకపై తమ జట్టు పెద్ద జట్లను ఓడిస్తే అది సంచలనం కానే కాదని బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ మొర్తజా అన్నాడు....
04-06-2019
Jun 04, 2019, 03:44 IST
కార్డిఫ్‌: ప్రపంచకప్‌లో శ్రీలంక మాజీ చాంపియన్‌. రెండు సార్లు రన్నరప్‌ కూడా! అయితే ఇది గతం. ఇప్పటి పరిస్థితి పూర్తి...
04-06-2019
Jun 04, 2019, 03:38 IST
సౌతాంప్టన్‌: భారత జట్టు మేనేజ్‌మెంట్‌ తీరుపై అసహనం వ్యక్తం చేసిన విలేకర్లు మీడియా సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేశారు. ప్రపంచకప్‌లో రేపు...
04-06-2019
Jun 04, 2019, 03:31 IST
పాకిస్తాన్‌ ఎప్పటిలాగే ఏం చేయగలదో అదే చేసి చూపించింది. సరిగ్గా మూడు రోజుల క్రితం 100 పరుగులు చేయడానికి ఆపసోపాలు...
03-06-2019
Jun 03, 2019, 23:29 IST
నాటింగ్‌హామ్‌ : సంచలనాల పాకిస్తాన్‌ చేతిలో ఇంగ్లండ్‌కు ఊహించని పరాభావం ఎదురైంది. భారీ లక్ష్యాలను అవలీలగా ఛేదిస్తూ విజయాలను అందుకుంటున్న...
03-06-2019
Jun 03, 2019, 21:09 IST
నాటింగ్‌హామ్‌: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు....
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top