పాక్‌ విజయం: స్టెప్పులేసిన భారత ఫ్యాన్స్‌ | World Cup 2019 Pakistani and Team India Fans Bhangra Dance | Sakshi
Sakshi News home page

పాక్‌ విజయం: భారత ఫ్యాన్స్‌ భాంగ్రా డ్యాన్స్‌

Jun 27 2019 5:15 PM | Updated on Jun 27 2019 7:20 PM

World Cup 2019 Pakistani and Team India Fans Bhangra Dance - Sakshi

బర్మింగ్‌హామ్‌: అనిశ్చితికి మారుపేరైన పాకిస్తాన్‌ బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సంచలన విజయం సాధించింది. వరుస విజయాలతో దూసుకపోతున్న కివీస్‌ జోరుకు పాక్‌ బ్రేక్‌ వేసింది. ప్రపంచకప్‌లో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్‌లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా సర్ఫరాజ్‌ సేన విజయం సాధించింది. దీంతో పాక్‌ సెమీస్‌ ఆశలు సజీవంగా నిలిచాయి. కివీస్‌పై విజయంతో పాక్‌ ఆటగాళ్లతో పాటు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే అనూహ్యంగా టీమిండియా అభిమానులు పాక్‌ ఫ్యాన్స్‌తో కలిసి సందడి చేశారు.  మైదానం బయట పాక్‌ ఫ్యాన్స్‌తో కలిసి మనవాళ్లు భాంగ్రా నృత్యం చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో తెగహల్‌చల్‌ చేస్తోంది.


మరోసారి టీమిండియా ఫ్యాన్స్‌ క్రీడాస్పూర్తిని చాటుకున్నారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.  అయితే పాక్‌ ఓడిపోవాలని కోరుకునే భారత అభిమానులు.. ఆ దేశం గెలిచినందుకు సంబరాలు చేసుకోవడం ఆకట్టుకుందని పేర్కొంటున్నారు. కివీస్‌-పాక్‌ మ్యాచ్‌లో ఇదే హైలెట్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ మ్యాచ్‌లో పాక్‌ జట్టుకు మద్దతుగా మైదానంలో సందడి చేశారు. ‘కమాన్‌ పాకిస్తాన్‌’అంటూ ఎంకరేజ్‌ చేశారు. ఒకరినొకరు కత్తులు దూసుకునే ఇరుజట్ల ఫ్యాన్స్‌ ఇలా కలిసి సంబరాలు చేసుకోవడం ఆశ్చర్యానికి గురిచేసిందంటూ మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement