బంగ్లాపై పంజా విసిరిన పాక్‌

World Cup 2019 Pakistan Beat Bangladesh By 94 Runs - Sakshi

లండన్‌ : అద్భుతాలేమీ జరగలేదు. అనుకున్నదే జరిగింది. 1992 ప్రపంచకప్‌ ఫలితాన్ని పునరావృతం చేయాలనుకున్న పాకిస్తాన్‌కు తీవ్ర నిరాశే ఎదురైంది. కనీసం సెమీస్‌కు చేరకుండానే లీగ్‌ దశలోనే ఇంటిబాటపట్టింది. చివరి లీగ్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ విజయం సాధించి అల్ప సంతోషంతోనే ప్రపంచకప్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రపంచకప్‌లో భాగంగా ప్రఖ్యాత లార్డ్స్‌ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 94 పరుగుల తేడాతో పాక్‌ జయభేరి మోగించింది. పాక్‌ నిర్దేశించిన 315 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 44.1 ఓవర్లలో 221 పరుగులకే కుప్పకూలింది. బంగ్లా ఆటగాళ్లలో సీనియర్‌ ఆటగాడు షకీబుల్‌ (64; 77 బంతుల్లో 6ఫోర్లు) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. బంగ్లా పతనాన్ని శాసించిన షాహిన్‌ ఆఫ్రిది (6/35)కి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది.

అంతకుముందు ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌(100: 100 బంతుల్లో 7ఫోర్లు) సెంచరీకి తోడు బాబర్‌ అజామ్‌ (96: 98 బంతుల్లో 11ఫోర్లు) రాణించడంతో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో పాక్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 315 పరుగుల భారీ స్కోరు చేసింది. ముస్తాఫిజుర్‌ రెహ్మాన్‌(5/75) టోర్నీలో వరుసగా రెండోసారి ఐదు వికెట్లతో చెలరేగాడు. 

అదరగొట్టిన ఇమామ్‌–బాబర్‌ జోడీ..
టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌ ఫకార్‌ జమాన్‌(13) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. ఈ దశలో ఇమామ్‌–బాబర్‌ జోడీ రెండో వికెట్‌కు 150 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది. ఒక దశలో జట్టు స్కోరు 350 దాటుతుందని అనిపించినా మిడిలార్డర్‌ వైఫల్యం పాక్‌ను దెబ్బతీసింది. తొలుత సెంచరీకి చేరువగా వచ్చిన బాబర్‌.. సైఫుద్దీన్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే సెంచరీ పూర్తిచేసుకున్న ఇమామ్‌ ఆ వెంటనే హిట్‌వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు.
దీంతో పాక్‌ ఇన్నింగ్స్‌ ఒక్కసారిగా కుదుపులకు లోనైంది. హఫీజ్‌(27), హారిస్‌ సొహైల్‌(6), రియాజ్‌(2), షాదాబ్‌(1), ఆమిర్‌(8) వెంట వెంటనే ఔటయ్యారు. ఆఖర్లో ఇమాద్‌ వసీం(43: 26 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్‌) మెరుపులు మెరిపించడంతో పాక్‌ స్కోరు 300 దాటింది. సర్ఫరాజ్‌(3), షహీన్‌ అఫ్రిది(0) అజేయంగా నిలిచారు.  బంగ్లా బౌలర్లలో సైఫుద్దీన్‌ 3, మెహిదీ హసన్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

19-07-2019
Jul 19, 2019, 15:04 IST
ప్రస్తుత పరిస్థితిపై ఉద్వేగానికి లోనవ్వకుండా స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని
18-07-2019
Jul 18, 2019, 15:42 IST
బౌండరీల ఆధారంగా విజేతను ప్రకటించడం ఓ చెత్త నిర్ణయం
18-07-2019
Jul 18, 2019, 13:21 IST
వన్డే ప్రపంచకప్‌లో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ జేమ్స్‌ నీషమ్‌ అత్యంత కీలక ఇన్నింగ్స్‌  ఆడుతుండగా..
17-07-2019
Jul 17, 2019, 22:14 IST
లండన్‌ : ప్రపంచకప్‌-2019లో తన విధ్వంసకర ఆటతీరుతో విమర్శకులచే ప్రశంసలు అందుకున్నాడు ఇంగ్లండ్‌ స్టార్‌ ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌. అంతేకాకుండా...
17-07-2019
Jul 17, 2019, 19:54 IST
ఫిట్‌నెస్‌ లేదు.. ఫామ్‌ లేదు.. అయినా జట్టులో ఎందుకు ఉంటారో అర్థం కావడం లేదు. వెళ్లిపోవచ్చు కదా!
17-07-2019
Jul 17, 2019, 16:24 IST
లండన్‌: ప్రపంచకప్ ఫైనల్లో చోటు చేసుకున్న ‘బెన్ స్టోక్స్.. ఓవర్‌త్రో’పై పెద్ద చర్చే జరుగుతోంది. ఈ అదనపు పరుగులతోనే ఇంగ్లండ్‌...
17-07-2019
Jul 17, 2019, 13:47 IST
బౌండరీ విధానంతో వన్డే ప్రపంచకప్‌ విజేతను ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతునూ ఉన్నాయి.
17-07-2019
Jul 17, 2019, 12:55 IST
న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌పై టీమిండియా ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు.
17-07-2019
Jul 17, 2019, 12:33 IST
టీమిండియా క్రికెటర్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇటీవల ముగిసిన ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా...
17-07-2019
Jul 17, 2019, 08:44 IST
ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ‘ఫేస్‌ యాప్‌’  విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది. భవిష్యత్తులో, ముఖ్యంగా వృద్ధాప్యంలో వ్యక్తులు ఎలా ఉంటారో ఈ...
17-07-2019
Jul 17, 2019, 07:57 IST
లండన్‌ : సొంతగడ్డపై వన్డే ప్రపంచ కప్‌ను గెలుచుకున్న ఇంగ్లండ్‌ విజయ సంబరాలు కొనసాగుతూనే ఉన్నాయి. తొలిసారి తమ దేశానికి...
17-07-2019
Jul 17, 2019, 02:47 IST
వెల్లింగ్టన్‌: ప్రపంచ కప్‌ ఫైనల్లో ఫలితాన్ని తేల్చిన తీరుపై న్యూజిలాండ్‌ వైపు నుంచి స్పందనలు కొనసాగుతూనే ఉన్నాయి. జట్టు కెప్టెన్‌...
16-07-2019
Jul 16, 2019, 15:42 IST
లండన్‌: వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌లో ఓవర్‌ త్రో అయిన బంతికి ఇంగ్లండ్‌కు ఆరు పరగులు కాకుండా ఐదు...
16-07-2019
Jul 16, 2019, 14:28 IST
ఓవర్‌ త్రో వివాదంపై మాట్లాడటానికి అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ)
16-07-2019
Jul 16, 2019, 14:07 IST
న్యూఢిల్లీ: క్రికెటర్ల ప్రదర్శన ఆధారంగా తమ అత్యుత్తమ జట్టును ప్రకటించడం దిగ్గజ క్రికెటర్ల ఆనవాయితీ.  వరల్డ్‌కప్‌కు ముందు పలువురు దిగ్గజ...
16-07-2019
Jul 16, 2019, 13:20 IST
న్యూఢిల్లీ: వరల్డ్‌కప్‌ వంటి మెగా టోర్నీలో అందులోనూ విజేతను ప్రకటించే క్రమంలో ‘బౌండరీ రూల్‌’ ను పాటించడంపై బాలీవుడ్‌ మెగాస్టార్‌...
16-07-2019
Jul 16, 2019, 11:35 IST
లండన్‌: అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జరిగిన వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చాంపియన్‌గా నిలిచింది. ఆద్యంతం ఉత్కంఠం...
16-07-2019
Jul 16, 2019, 10:51 IST
లండన్‌: వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో న్యూజిలాండ్‌ కప్‌ అంచుల వరకూ వెళ్లి చతికిలబడటం వెనుక ఆ జట్టు ఆటగాళ్ల తప్పిదాలు...
16-07-2019
Jul 16, 2019, 10:03 IST
న్యూఢిల్లీ: ఇప్పటివరకైతే మహేంద్ర సింగ్‌ ధోని రిటైర్మెంట్‌పై స్పష్టత లేదు కానీ... వచ్చే నెలలో వెస్టిండీస్‌ లో పర్యటించే భారత...
16-07-2019
Jul 16, 2019, 05:05 IST
లండన్‌: ప్రపంచ కప్‌ విజేతగా నిలిచే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్న న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు మొత్తం తీవ్ర నిరాశకు గురైంది....
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top