సారెజ్ సంచలనం: ఇంగ్లండ్‌పై ఉరుగ్వే విజయం | World Cup 2014: Uruguay Defeats England, 2-1 | Sakshi
Sakshi News home page

సారెజ్ సంచలనం: ఇంగ్లండ్‌పై ఉరుగ్వే విజయం

Jun 20 2014 9:06 AM | Updated on Oct 22 2018 5:58 PM

ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఉరుగ్వే స్టార్ ఆటగాడు లూయీస్ సారెజ్ చెలరేగాడు.

 సావోపాలో: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో ఉరుగ్వే స్టార్ ఆటగాడు లూయీస్ సారెజ్ చెలరేగాడు. అతని సంచలన ప్రదర్శనతో గురువారం అర్ధ రాత్రి దాటాక జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో ఉరుగ్వే 2-1 తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. మాజీ చాంపియన్ ఇంగ్లండ్ టోర్నీలో ఆడిన 2 మ్యాచ్‌లూ ఓడింది.

39వ నిమిషంలో హెడర్ ద్వారా గోల్ చేసి సారెజ్ ఉరుగ్వేకు ఆధిక్యం అందించాడు. ఆ తర్వాత 75వ నిమిషంలో వేన్ రూనీ గోల్‌తో ఇంగ్లండ్ స్కోరు సమం చేసింది. రూనీకి ప్రపంచకప్‌లో ఇదే తొలి గోల్. అయితే మళ్లీ అద్భుతంగా ఆడిన సారెజ్ 85వ నిమిషంలో మరో గోల్ చేసి తన జట్టును గెలిపించాడు.

Advertisement
 
Advertisement
Advertisement