డిన్నర్‌కు ఎప్పుడు వస్తున్నావు! | When to come to dinner | Sakshi
Sakshi News home page

డిన్నర్‌కు ఎప్పుడు వస్తున్నావు!

Aug 30 2015 11:51 PM | Updated on Sep 3 2017 8:25 AM

డిన్నర్‌కు ఎప్పుడు వస్తున్నావు!

డిన్నర్‌కు ఎప్పుడు వస్తున్నావు!

ఇషాంత్ శర్మ మారలేదు... గత టెస్టులో రెండు సంఘటనల తర్వాత అతని మ్యాచ్ ఫీజులో 65 శాతం జరి మానాగా విధించినా

కొలంబో : ఇషాంత్ శర్మ మారలేదు... గత టెస్టులో రెండు సంఘటనల తర్వాత అతని మ్యాచ్ ఫీజులో 65 శాతం జరి మానాగా విధించినా ఈసారి కూడా ‘లంబూ’ మైదానంలో తన నోటికి పని చెప్పాడు. మళ్లీ శ్రీలంక ఆటగాళ్లతో దురుసుగా ప్రవర్తించాడు. కుషాల్ పెరీరా, హెరాత్ క్రీజ్‌లో కుదురుకొని పరుగులు రాబడుతున్న దశలో ఇది జరిగింది. 32వ ఓవర్లో ఇషాంత్, హెరాత్‌కు బౌన్సర్ విసిరాడు. దానిని బ్యా ట్స్‌మన్ తప్పించుకున్న అనంతరం ఇద్దరూ కళ్లతోనే కలహించుకోవడంతో అంపైర్లు కలగజేసుకున్నారు.

ఇషాంత్ తర్వాతి ఓవర్లోనే ఒక ఫోర్ బాది కుషాల్ వెంటనే అవుటయ్యాడు. పెవిలియన్ వైపు వెళుతున్న కుషాల్‌ను ఇషాంత్ దూషించడంతో ఈసారి కోహ్లి సర్ది చెప్పాల్సి వచ్చింది. మ్యాచ్ అనంతరం దీనిని తేలికపరిచే ప్రయత్నం చేస్తూ ఇషాంత్... ‘అతను నాకు మంచి మిత్రుడే. నాతో ఏ సమయంలో డిన్నర్‌కు వస్తున్నావని అడిగానంతే’ అని బదులిచ్చాడు!

Advertisement
 
Advertisement
Advertisement