టీమిండియా ప్లేస్లోకి విండీస్! | West Indies overtake India; Evin Lewis climbs to fourth | Sakshi
Sakshi News home page

టీమిండియా ప్లేస్లోకి విండీస్!

Jul 10 2017 3:44 PM | Updated on Sep 5 2017 3:42 PM

టీమిండియా ప్లేస్లోకి విండీస్!

టీమిండియా ప్లేస్లోకి విండీస్!

వెస్టిండీస్ తో జరిగిన ఏకైక టీ 20 మ్యాచ్లో తొమ్మిది వికెట్ల తేడాతో పరాజయం చెందిన భారత జట్టు.. పొట్టి ఫార్మాట్ ర్యాంకింగ్స్ లో సైతం కిందకి దిగజారింది.

జమైకా: వెస్టిండీస్ తో జరిగిన ఏకైక టీ 20 మ్యాచ్లో తొమ్మిది వికెట్ల తేడాతో పరాజయం చెందిన భారత జట్టు.. ఈ ఫార్మాట్ ర్యాంకింగ్స్ లో సైతం కిందకి దిగజారింది. తాజా టీ 20 ర్యాంకింగ్స్ ను పరిశీలిస్తే భారత్ జట్టు ఐదో స్థానానికి పడిపోగా, విండీస్ మూడు పాయింట్లను తన ఖాతాలో వేసుకుని నాల్గో స్థానానికి ఎగబాకింది. ఇక్కడ విండీస్ పూర్వపు స్థానంలో భారత్ నిలవడం ఒకటైతే, భారత జట్టు ర్యాంకును విండీస్ ఎగురేసుకుపోవడం మరొకటి.

ఈ మ్యాచ్ కు ముందు నాల్గో స్థానంలో ఉన్న విరాట్ సేన.. ఓటమి తరువాత మూడు పాయింట్లను కోల్పోయింది. ప్రస్తుతం 115 రేటింగ్ పాయింట్లతో  భారత్ జట్టు ఐదో స్థానంలో నిలిచింది. ఇక్కడ న్యూజిలాండ్(125), ఇంగ్లండ్(123), పాకిస్తాన్(121) తొలి మూడు స్థానాల్లో ఉండగా, ఆస్ట్రేలియా ఆరో స్థానంలో నిలిచింది.

ఇక టీ 20 బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్ లో విండీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన లూయిస్ నాల్గో స్థానాన్ని ఆక్రమించాడు. మరొకవైపు టీమిండియా సారథి విరాట్ కోహ్లి 804 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.  ఆసీస్ ఓపెనర్ అరోన్ ఫించ్ రెండో స్థానంలో ఉండగా, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మూడో స్థానంలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement