వసీం జాఫర్‌ సెంచరీ

Wasim Jaffer Century - Sakshi

విదర్భ 289/2 

నాగ్‌పూర్‌: వసీం జాఫర్‌ (113 బ్యాటింగ్‌; 16 ఫోర్లు, 1 సిక్స్‌) అజేయ శతకంతో చెలరేగడంతో రెస్టాఫ్‌ ఇండియాతో బుధవారం మొదలైన ఇరానీ కప్‌ మ్యాచ్‌లో రంజీ చాంపియన్‌ విదర్భ తొలి రోజు మెరుగైన స్థితిలో నిలిచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విదర్భ ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 289 పరుగులు చేసింది.

కెప్టెన్‌ ఫైజ్‌ ఫజల్‌ (89; 6 ఫోర్లు, 1 సిక్స్‌), సంజయ్‌ రామస్వామి (53; 6 ఫోర్లు, 1 సిక్స్‌) తొలి వికెట్‌కు 101 పరుగులు జతచేశారు. సంజయ్‌ అవుటయ్యాక క్రీజులోకొచ్చిన జాఫర్‌ ఇన్నింగ్స్‌ ముందుకు నడిపించాడు. ఈ క్రమంలో 40 ఏళ్ల జాఫర్‌ ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌లో 53వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అశ్విన్‌ (25–1–66–1) ఆఫ్‌ స్పిన్‌ను పక్కన పెట్టి లెగ్‌బ్రేక్‌ ప్రయత్నించినా లాభం లేకపోయింది.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top