ఏది ఏమైనా వదలడు.. కుంబ్లేపై లక్ష్మణ్‌ ప్రశంసలు

VVS Laxman Pays Tribute to Anil Kumble And Sachin Tendulkar - Sakshi

హైదరాబాద్‌ : మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌, టీమిండియా మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లేలపై మాజీ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ ప్రశంసల వర్షం కురిపించారు. అటువంటి గొప్ప ఆటగాళ్లతో కలిసి ఆడటం తన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే లక్ష్మణ్‌.. తనను బాగా ప్రభావితం చేసిన సహచరుల గురించి అభిప్రాయాలు పంచుకుంటానని చెప్పిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా వారి దగ్గరి నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. 

ఈ క్రమంలోనే సచిన్‌, కుంబ్లేల గొప్పతనాన్ని వివరించే ప్రయత్నం చేశారు. ఏది ఏమైనా చేసే పనిని వదలకపోవడం కుంబ్లే లక్షణమని పేర్కొన్నారు. 2002లో వెస్టీండిస్‌తో టెస్ట్‌ మ్యాచ్‌ సందర్భంగా కుంబ్లే గాయపడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో‌ బ్యాటింగ్‌ చేస్తుండగా కుంబ్లే దవడకు గాయం కాగా, దానిని లెక్క చేయకుండా కుంబ్లే ఆటను కొనసాగించారు. ఆ తర్వాత నొప్పి ఉన్నప్పటికీ.. బౌలింగ్‌ కూడా చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్‌ చేసిన లక్ష్మణ్‌.. కుంబ్లేకు ఉన్న ధైర్యం, తెగువ ఈ ఫొటోలో కనిపిస్తోందన్నారు. ప్రతి అంశంలో కుంబ్లే అసాధారణ శక్తిని ప్రదర్శించేవారని కొనియాడారు. 

అంతకు ముందు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌పై కూడా లక్ష్మణ్‌ ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్ని ప్రశంసలు అందుకున్నప్పటికీ.. ఒదిగి ఉండటం సచిన్‌ గొప్ప లక్షణాల్లో ఒకటని కొనియాడారు. ఆటపై సచిన్‌ నిబద్ధత, అభిరుచి, గౌరవం.. అతనంటే ఎంటో తెలియజేస్తుందన్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top