చచ్చిపోయినా ఫర్వాలేదనుకున్నా! | Viv Richards Once Again Remembered His Game | Sakshi
Sakshi News home page

చచ్చిపోయినా ఫర్వాలేదనుకున్నా!

Apr 10 2020 3:38 AM | Updated on Apr 10 2020 10:12 AM

Viv Richards Once Again Remembered His Game - Sakshi

మెల్‌బోర్న్‌:  క్రికెట్‌ ఆల్‌టైమ్‌ గ్రేట్‌లలో ఒకడైన సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌ తన సుదీర్ఘ కెరీర్‌లో ఏనాడూ హెల్మెట్‌ పెట్టుకోలేదు. ఎలాంటి భయం లేకుండానే బరిలోకి దిగిన అతను ఆ సమయంలో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్‌ బౌలర్లను చితక్కొట్టాడు. ఆటపై ఉన్న పిచ్చి ప్రేమే తనలో ధైర్యాన్ని నింపిందని రిచర్డ్స్‌ గుర్తు చేసుకున్నాడు. ‘క్రికెట్‌ను నేను విపరీతంగా ప్రేమించాను. ఎంతగా అంటే ఆడుతూనే చనిపోయి నా ఫర్వాలేదనుకునేవాడిని. క్రికెట్‌ను నేను ఎంచుకున్నాను కాబట్టి మైదానంలోనే కుప్పకూలినా అంతకంటే అదృష్టం లేదని భావించేవాడిని’ అని ఈ విధ్వంసక బ్యాట్స్‌మన్‌ వ్యాఖ్యానించాడు. ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ షేన్‌వాట్సన్‌తో వీడియో సంభాషణ సందర్భంగా రిచర్డ్స్‌ ఈ మాటలు అన్నాడు. ‘ఇతర ఆటగాళ్లను చూసి నేను ఎప్పుడూ స్ఫూర్తి పొందేవాడిని. అత్యుత్తమ స్థాయిలో రాణించే మహిళలను కూడా అలాగే గౌరవించేవాడిని. ఫార్ములా వన్‌ రేసింగ్‌ కార్‌ను డ్రైవ్‌ చేసేవారిని చూస్తే అంతకంటే ప్రమాదకరం ఇంకేం ఉంటుందని అనిపించేది’ అంటూ వివ్‌ అన్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement