కార్ల్‌సన్‌తో ఆనంద్ గేమ్ ‘డ్రా’ | Viswanathan Anand to renew rivalry with Magnus Carlsen in Zurich Chess Challenge | Sakshi
Sakshi News home page

కార్ల్‌సన్‌తో ఆనంద్ గేమ్ ‘డ్రా’

Feb 4 2014 12:36 AM | Updated on Sep 2 2017 3:18 AM

ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌తో సోమవారం జరిగిన జ్యూరిచ్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్ ఐదో రౌండ్ గేమ్‌ను భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు.

జ్యూరిచ్: ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌తో సోమవారం జరిగిన జ్యూరిచ్ క్లాసిక్ చెస్ టోర్నమెంట్ ఐదో రౌండ్ గేమ్‌ను భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించాడు. అంతకుముందు ఆదివారం ఆలస్యంగా ముగిసిన నాలుగో రౌండ్ గేమ్‌లో ఆనంద్ 36 ఎత్తుల్లో బోరిస్ గెల్ఫాండ్ (ఇజ్రాయెల్)పై విజయం సాధించాడు. ఈ టోర్నీలో ఆనంద్‌కిదే తొలి విజయం కావడం విశేషం. తొలి రెండు గేముల్లో ఓటమిపాలైన ఆనంద్ మూడో గేమ్‌ను డ్రాతో సరిపెట్టుకున్నాడు. ఓవరాల్‌గా ఆనంద్ ఈ టోర్నీలో మూడున్నర పాయింట్లు సంపాదించాడు.

Advertisement
 
Advertisement
Advertisement