రోహిత్‌పై అప్పుడెందుకు వేటేశారు: సెహ్వాగ్‌

Virender Sehwag Blasts Selectors Why Did They Drop Rohit Sharma From Tests Earlier - Sakshi

న్యూఢిల్లీ : గత టెస్ట్‌ సిరీస్‌ల్లో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మపై ఎందుకు వేటేశారో సమాధానం చెప్పాలని డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సెలక్టర్లను ప్రశ్నించారు. ఓ యూట్యూబ్‌ ఛానెల్‌తో మాట్లాడుతూ.. ‘ భారత గడ్డపై శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో రోహిత్‌ ఒక శతకం, హాఫ్‌ సెంచరీతో రాణించాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో విఫలమయ్యాడు. అంత మాత్రానా రోహిత్‌ను టెస్ట్‌లకు దూరం పెడ్తారా? కనీసం ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌ సిరీస్‌కు కూడా ఎంపికచేయలేదు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఎంత మంది బ్యాట్స్‌మెన్‌ రాణించారు? ఒక్క రోహిత్‌నే ఎందుకు టెస్టుల నుంచి దూరం పెట్టారు. సెలక్టర్లు సమాధానం చెప్పాలి. అతను వన్డేల్లో మూడు డబుల్‌ సెంచరీలు చేశాడన్న విషయం మర్చిపోవద్దు. టెస్టు జట్టులో తన స్థానం ఎంటో తెలుసుకోకపోవడం అతని కర్మా? వన్డేల్లో అద్భుతంగా రాణించి, టెస్ట్‌ల్లో చోటు దక్కని బ్యాట్స్‌మెన్‌ ప్రపంచంలోనే ఎవరూ లేరు.’ అని సెహ్వాగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

దక్షిణాఫ్రికా పర్యటనలో దారుణంగా విఫలమవడంతో రోహిత్‌ను అఫ్గాన్‌తో జరిగిన చారిత్రాత్మక టెస్టు, ఇంగ్లండ్‌తో 5 టెస్టులకు దూరం పెట్టారు. దీంతో రోహిత్‌ టెస్ట్‌ కెరీర్‌ ముగిసిందని అందరు భావించారు. కానీ ఆసియా కప్‌, వెస్టిండీస్‌తో సిరీస్‌లో రాణించడంతో ఆస్ట్రేలియా పర్యటనలో 4 టెస్ట్‌ల సిరీస్‌కు ఎంపికయ్యాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top