‘మమత’ మనసును దోచేసింది : విరాట్‌ కోహ్లి | Virat Kohli Tweet On Anushka Sharma Sui Dhaaga Movie | Sakshi
Sakshi News home page

Sep 28 2018 11:57 AM | Updated on Sep 28 2018 1:08 PM

Virat Kohli Tweet On Anushka Sharma Sui Dhaaga Movie - Sakshi

అనుష్క శర్మ, వరుణ్‌ ధావన్‌ జంటగా నటించిన ‘సూయీ ధాగా’ నేడు విడుదలైన సంగతి తెలిసిందే. గత రాత్రి ప్రదర్శించిన ప్రత్యేక షోను వీక్షించిన బాలీవుడ్‌ ప్రముఖులు సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రం ప్రస్తుతం పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తోంది. అయితే ఈ సినిమాను వీక్షించిన టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి చేసిన ట్వీట్‌ వైరల్‌ అవుతోంది. 

‘‘సుయీ ధాగా’ సినిమాను గురువారం రాత్రి చూసినప్పుడు నచ్చింది. మళ్లీ రెండోసారి చూసినప్పుడు మరింత నచ్చింది. ఈ చిత్రం భావోద్వేగంతో కూడుకున్న రోలర్‌కోస్టర్‌ లాంటిది. సినిమాలోని ప్రతి ఒక్కరూ చాలా అద్భుతంగా నటించారు. మౌజీ(వరుణ్‌ ధావన్‌) సూపర్‌గా నటించాడు. కానీ మమత(అనుష్క శర్మ) పాత్ర నా మనసును దోచుకుంది. సినిమాలో ఆమెది చాలా నిదానమైన పాత్ర అయినప్పటికీ.. శక్తిమంతమైన, ప్రభావవంతమైన పాత్ర. మమత మీ మనసులు కూడా దోచుకుంటుంది. నా ప్రేమను(అనుష్క) చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. సినిమాను మిస్‌ కావొద్ద’ని ట్వీట్‌ చేశాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement